సన్నీ లియోన్.. ఈ పేరు యువతకు బాగా సూపరచితమే.. ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సన్నీ హాట్ హాట్ ఫోటోలను నెట్టింట అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.. దాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నరు.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
మొదట పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేసిన సన్నీలియోన్… నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. నటిగా, హాట్ స్టార్ గా ఎంతో మంది తభిమానులను సంపాదించుకున్న సన్నీ లియోన్.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది.. ఇక తెలుగులో కూడా ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తుంది.. సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ నిన్న వారణాసిలో గంగాహారతికి హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఆమె భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.. ఆ పూజకు సంబందించిన ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..
పింక్ డ్రెస్, మెడలో దండతో కార్యక్రమానికి హాజరైంది. పండితులు పూజలు చేస్తుంటే రెండు చేతులు కలిసి నమస్కరిస్తూ.. కనిపించింది. ఆమెతోపాటు నటుడు అభిషేక్ కూడా ఉన్నారు. ఇక హాట్ స్టార్ గా ఉన్న సన్నీ ఇలా రావడంతో అక్కడ ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు. హాట్ హాట్ గా ఉండే సన్నీలియోన్.. ఇలా కనిపించేసరికి అంతా విచిత్రంగా చూస్తున్నారు.. తన భర్త కూడా పూజలో పాల్గొన్నారు.. అభిషేక్ సింగ్ కలిసి చేసిన థర్డ్ పార్టీ మ్యూజిక్ వీడియోను బుధవారం విడుదల చేశారు.. ఆ పాటను రాశి, పాడి, కంపోజ్ కూడా తానే చేశారు.. బాగా ట్రెండ్ అవుతుంది..
#WATCH | Uttar Pradesh: Actor Sunny Leone attends ‘Ganga Aarti’ in Varanasi. pic.twitter.com/o5myI7g8ep
— ANI (@ANI) November 16, 2023