Car on Fire: యూపీలోని వారణాసిలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ గమనించి కారులో నుంచి దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాడేసర్‌లో జరిగింది. వెంటనే అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కారులో మంటలు చెలరేగడానికి ఇంజిన్‌లో షార్ట్‌సర్క్యూటే ప్రధాన కారణం అంటున్నారు.
Read Also: Apple IPhone: యాపిల్‌కు భారీ దెబ్బ!.. ఆ దేశంలో ఆఫీస్ పనులకు ఐఫోన్లు వాడొద్దట..
కారు డ్రైవర్ బులంద్‌షహర్‌కి చెందిన అజిత్ గా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదంలో అతనికి స్వల్పగాయాలు కాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొద్దిసేపు వాహనాలు స్తంభించాయి. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
Read Also: Bigg Boss Sivaji: బీపీనా.. బొక్కా.. నన్ను రెచ్చగొట్టకు బిగ్ బాస్.. నీకన్నా పెద్దవాళ్లనే డీల్ చేశా