Comedian Shyam Rangeela Will Contest Against PM Modi From Varanasi: ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు, అది కూడా ప్రధాని మోడీ మీద. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ప్రధానికి తనదైన భాషలో సమాధానం చెప్పేందుకు వారణాసి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్…
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. అయితే ఎన్నికల మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
Gyanvapi: జ్ఞానవాపీ మసీదు వివాదంలో ఆ ప్రాంతాన్ని సర్వే చేయాలని 2022లో ఆదేశాలు జారీ చేసిని వారణాసి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్కి అంతర్జాతీయ నెంబర్ల నుంచి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు ఎట్టకేలకు దొరికేసింది. గత నెల 19వ తేదీన ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో కనిపించింది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ నాలుగో జాబితాను 46 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. ఇందులో రాజ్ గఢ్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. తాజాగా విడుదలైన జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి 12, ఉత్తరప్రదేశ్ నుంచి 9, తమిళనాడు నుంచి 7, రాజస్థాన్ 3, ఉత్తరాఖండ్, మణిపుర్, జమ్ము కశ్మీర్లో రెండేసి స్థానాలకు అభ్యర్థుల…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన వారణాసి పర్యటనలో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వారణాసి ప్రజలు ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించినందుకు ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్నవారిని తాను చూశానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ శుక్రవారం మండిపడ్డారు.
ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi).. అచ్చం వాళ్ల నాయనమ్మ ఇందిరాగాంధీని పోలి ఉంటారు. ఆమెను చూసిన కాంగ్రెస్ కార్యకర్తలంతా ఇందిరానే ఊహించుకుంటారు. ఇకపోతే ప్రియాంక ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) నివేదిక సంచలనంగా మారింది. ఏఎస్ఐ సర్వేలో మసీదుకు ముందు అక్కడి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని తేలింది. వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలని, ఇరు పక్షాలకు రిపోర్టును అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వేకి చెందిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే సర్వే తర్వాత విశ్వహిందూ పరిషత్(VHP) జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది.
Gyanvapi Case: వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే సంచలనంగా మారింది. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ రిపోర్టును బహిరంగపరచడం జరిగింది. ఇప్పటికే రెండు వర్గాలకు ఈ రిపోర్టు అందింది. నిన్న హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ రిపోర్టులోని అంశాలను మీడియాకు వెళ్లడిస్తూ.. అక్కడి మసీదుకు పూర్వం పెద్ద హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తుందని వెల్లడించారు.