జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలంటూ హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది.
Supreme Court to hear Gyanvapi mosque case on November 10: జ్ఞానవాపీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరపనుంది. నవంబర్ 10న ఈ అంశం సుప్రీం ధర్మాసనం ముందుకు రానుంది. ఇప్పటికే ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారిస్తోంది. వీడియో సర్వేలో జ్ఞానవాపీ మసీదులో లభించిన శివలింగాన్ని పరిరక్షించాలని మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.ఈ ఆదేశాల తరువాత మళ్లీ ఇప్పుడే సుప్రీంకోర్టు…
Gyanvapi Mosque issue: జ్ఞానవాపి మసీదు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది వారణాసి కోర్టు. హిందూ పక్షం తరుపు మసీదులోని వాజూఖానాలో బయటపడిన శివలింగానికి శాస్త్రీయ పరిశోధన జరగాలని.. కార్బన్ డేటింగ్ జరిపించాలని కోరుతూ కోర్టును కోరారు. అయితే శుక్రవారం రోజూ హిందూ పక్షం డిమాండ్ ను వారణాసి కోర్టు తిరస్కరించింది. హిందూ సంఘాల తరుపున వాదిస్తున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది.
జ్ఞానవాపీ మసీదు కేసులో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ జరపాలంటూ హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై తీర్పును వారణాసి కోర్టు అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
Crucial Court Order Today On Carbon Dating Of 'Shivling' In Gyanvapi Case: ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. ఆ తరువాత ఈ…
Hindu Side Moves Plea Seeking Carbon Dating Of 'Shivalinga': జ్ఞానవాపి మసీదు కేసులో గురువారం వారణాసి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. హిందూ పక్షం న్యాయవాది విష్ణు జైన్, జ్ఞానవాపి మసీదులో ఉన్న శివలింగానికి ‘కార్బన్ డేటింగ్’చేయాలని శివలింగంగా చెబుతున్న ఆకారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
Mehbooba Mufti comments on Gyanvapi case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఇది స్పష్టంగా ప్రార్థన స్థలాల చట్టాలను ఉల్లఘించడమే అని అన్నారు. ఉద్యోగాలు కల్పించడంలో, ద్రవ్యోల్భాన్ని నియంత్రించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మనం మసీదులు పడగొట్టడంలో ‘‘విశ్వగురువు’’ అవుతామని బీజేపీని ఎద్దేవా చేశారు.
జ్ఞానవాపి మసీదు కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా వారణాసి జిల్లా కోర్ట్ లో ఈ కేసుపై విచారణ జరగుతోంది. తాజాగా ఈ రోజు వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా వేసిన పిటిషన్ ను వారణాసి కోర్ట్ విచారించింది. అయితే కోర్ట్ ముస్లింల తరుపున తదుపరి వాదనలను వినేందుకు మే 30కి విచారణ వాయిదా వేసింది. అయితే ఇప్పటికే వీడియో సర్వేపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు హిందూ, ముస్లిం పక్షాలకు కోర్ట్…