అంజుమన్ ఇనాజానియా మసాజిద్ కమిటీ డిమాండ్‌ను జిల్లా జడ్జి కోర్టు తిరస్కరించడంతో జ్ఞాన్‌వాపీ-శృంగర్ గౌరీ కేసు గురువారం మొదటిసారిగా విచారణకు వచ్చింది. గురువారం హిందూ పక్షం కోర్టుకు చేరుకొని పిటిషన్ పూర్తి కాపీని కూడా దాఖలు చేసింది. దీనిపై వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ విచారణ చేపట్టారు. వాస్తవానికి సెప్టెంబర్ 12న జిల్లా న్యాయమూర్తి కేసును నిర్వహించాల్సి ఉండగా.. ఆ తర్వాత అంజుమన్ ద్వారా దీనిపై ఎనిమిది వారాల తర్వాత విచారణ జరపాలని దరఖాస్తు కూడా ఇచ్చారు.
అయితే.. ముస్లిం పక్షం తరుఫున దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన జిల్లా కోర్టు.. హిందూవుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కాగా ముస్లిం తరపు న్యాయవాది మెరాజుద్దీన్ సిద్ధిఖీ జిల్లా కోర్టు తీర్పుపై తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మరోవైపు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా జిల్లా కోర్టు నిర్ణయం నిరాశపరిచిందని పేర్కొంది.