జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేటి ఉదయం సంచలన తీర్పు వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్ కా తేకానాలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది.
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు వివాదంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ విచారించారు. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారని కమిటీ తరుపున వాదిస్తున్న ఎస్ఎఫ్ఏ నఖ్వీ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో గల విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు ప్రారంభమయ్యాయి.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదుపై తన సీల్డ్ సైంటిఫిక్ సర్వే నివేదికను సమర్పించింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు గత వారం ఏఎస్‌ఐకి కోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి సర్వే నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)ను ఆదేశించిన జిల్లా కోర్టు ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది.
కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు కార్బన్ డేటింగ్‌ను వారణాసి కోర్టు శుక్రవారం అనుమతించింది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో వివాదాస్పద 'శివలింగం' నిర్మాణాన్ని మినహాయించి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలకు వారణాసి కోర్టు నోటీసులు చేసింది. న్యాయవాది హరిశంకర్ పాండే దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై అదనపు జిల్లా న్యాయమూర్తి అనురాధ కుష్వాహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
Varanasi court to deliver its verdict on plea seeking worship rights of 'Shivling' on Gyanvapi premises: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. హిందూ పక్షం మసీదులోని కొలనులో లభించిన ‘ శివలింగం ’ ఆకారాన్ని పూజించేందుకు అనుమతించాలని కోర్టును కోరింది. దీనిపై నేడు తీర్పును వెల్లడించనుంది. నవంబర్ 8న ఈ కేసు తీర్పును నవంబర్ 14కు వాయిదా వేసింది. హిందూ…
Gyanvapi 'Shivling' to be protected until further orders Says Supreme Court: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ వివాదంపై కీలక ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గతంలో తాము ఇచ్చిన రక్షణ ఆదేశాలను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మసీదు వీడియో సర్వేలో భాగంగా వాజూఖానాలోని ఓ కొలనులో ‘శివలింగం’ వంటి…