Gyanvapi Case: కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు కార్బన్ డేటింగ్‌ను వారణాసి కోర్టు శుక్రవారం అనుమతించింది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో వివాదాస్పద ‘శివలింగం’ నిర్మాణాన్ని మినహాయించి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. జ్ఞాన్‌వాపి మసీదు కేసులో హిందువుల తరపున వాదిస్తున్న విష్ణు శంకర్ జైన్.. తన దరఖాస్తు ఆమోదించబడిందని తెలిపారు. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించిందన్నారు.
ఈ కేసులో హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదిస్తూ.. మొత్తం జ్ఞాన్‌వాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయాలని ఏఎస్‌ఐకి కోర్టు ఆదేశాలను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మేలో పిటిషన్‌ను విచారించడానికి కోర్టు అంగీకరించిన తర్వాత, హిందూ పక్షం చేసిన సమర్పణలకు సమాధానం ఇవ్వాల్సిందిగా జ్ఞాన్‌వాపి మసీదు కమిటీని కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈరోజు నిర్ణయం తీసుకుంది.
Read Also : Manipur Shocker: మణిపూర్‌లో మరో షాకింగ్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు వివాదంలో మొత్తం మసీదు సముదాయాన్ని పురావస్తు పరిశోధన ద్వారా మాత్రమే పరిష్కరించగలదని జైన్ కోర్టులో వాదించారు. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని మూడు గోపురాలు, కాంప్లెక్స్‌లోని పశ్చిమ గోడ, మొత్తం కాంప్లెక్స్‌ను ఆధునిక పద్ధతిలో పరిశీలించిన తర్వాత పరిస్థితి స్పష్టమవుతుందని ఆయన అన్నారు. మేలో జ్ఞాన్‌వాపి మసీదు-కాశీ విశ్వనాథ్ కారిడార్‌లోని వివాదాస్పద ‘శివలింగ్’ నిర్మాణానికి కార్బన్ డేటింగ్ నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ కట్టడం ‘శివలింగం’ లేదా ఫౌంటెన్ కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు శాస్త్రీయ విచారణకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.