ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారం రేపాయి. దీంతో రాధా అంశంపై స్పందించిన బెజవాడ సీపీ క్రాంతి రానా మాట్లాడుతూ.. రాధా రెక్కీపై నిర్దిష్ట ఆధారాలు దొరకలేదని ఆయన వెల్లడించారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని, మాకు రాధా రెక్కీపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఆయన అన్నారు. అంతేకాకుండా 2 నెలల సీసీ టీవీ ఫుటేజ్ ను ప్రస్తుతం పరిశీలిస్తామని, ఘటనపై పూర్తి స్థాయి…
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వంగవీటిరాధా ప్రాణాలకు ముప్పు ఉందని అతడు చెప్పినప్పటి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇద్దరూ గన్‌మెన్‌లను పంపిచినప్పటికీ రాధా సున్నితంగా తిరస్కరించారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ సీనియర్‌నేత కళా వెంకట్రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రాధపై రెక్కీ నిర్వహించడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ.. ఇప్పటివరకు…
తన హత్యకు రెక్కీ జరుగుతోందని ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని వంగవీటి రాధా కార్యాలయం ముందు గత కొన్నిరోజులుగా పార్క్ చేసిన స్కూటర్ అనుమానాస్పదంగా మారడంతో రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్క్ చేసిన స్కూటర్ ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: బీమా కంపెనీల ఆఫర్… పెళ్లి క్యాన్సిల్…
ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత…
వంగవీటి రాధా ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని పేర్కొన్నారు.. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. చివరకు ప్రభుత్వం వెంటనే రాధాకు 2+2 గన్‌మన్ల భద్రత కూడా కల్పించింది. రాధా భద్రతపై సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు కీలక…
ఓ పెద్ద నాయకుడికి ఆయన వారసుడు. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విపక్షపార్టీలో ఉన్నా పెద్దగా చప్పుడు లేదు. కానీ.. తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసి.. ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఇంతకీ అది వ్యూహమా? నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందా? తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణపై బెజవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన పని తాను చేసుకుపోయే రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న.…
వంగవీటి రంగా వర్థంతి సభలో తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని రాధా సంచలనానికి తెరలేపారు.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని రాధా స్పష్టం చేవారు. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే, ఇవాళ వంగవీటి రాధాకు సెక్యూరిటీ పెంచింది ఏపీ ప్రభుత్వం.. వంగవీటి రాధాకు 2+2 భద్రత కల్పించాలని…
తనను హత్య చేసేందుకు రెక్కీ జరుగుతోందని ఆదివారం నాడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించాయి. దీంతో ఆయన హత్యకు ఎవరు రెక్కీ నిర్వహిస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై వంగవీటి రాధా సోదరుడు వంగవీటి నరేంద్ర స్పందించారు. తన తమ్ముడు టీడీపీలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని.. ఎందుకంటే వంగవీటి రంగా హత్యకు కారణం టీడీపీ నేతలే అని తన అభిప్రాయమన్నారు. అయితే తన తమ్ముడితో…
వంగవీటి రాధాను పొగడ్తలతో ముంచెత్తారు మంత్రి కొడాలి నాని. వంగవీటి రాధా బంగారమని, కాస్త రాగి కలిపితే… ఎటు కావాలంటే అటు వంగొచ్చన్నా… రాధా ఒప్పుకోలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టిడిపి నాయకులు చెప్పినా… పదవులు ఆశించకుండా ఆ పార్టీలో చేరారన అన్నారు. తన తమ్ముడు రాధా మేలిమి బంగారమంటూ కొనియాడారు కొడాలి నాని. ఇది ఇలా ఉండగా… వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపడానికి రెక్కీ నిర్వహించారని.. రంగా కీర్తి ,ఆశయాల…