Off The Record: వంగవీటి మోహన రంగా… ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా… ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్‌ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే… రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నా… ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది.ఎన్నికల సమయంలో అయితే రంగా నామస్మరణ చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. రంగా కుమారుడు రాధా సెంట్రిక్‌గా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. అదంతా ఒక ఎత్తయితే… ఈసారి రంగా జయంతికి కూటమి పార్టీల పెద్దలెవరూ ఆయన్ని గుర్తు చేసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈనెల 4న వంగవీటి రంగా జయంతి జరిగింది. రాధా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. అయినాసరే… కూటమి పెద్దలు ఆ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వెనక రీజన్స్ ఏంటంటూ ఆరా తీస్తున్నాయి రాజకీయవర్గాలు.
Read Also: Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లు.. చట్టసభలన్నింటికీ రిజర్వేషన్ వర్తిస్తుందా?
2004 తర్వాత వంగవీటి రాధా అధికార పక్షంలో ఉన్నది ఇప్పుడే కావడంతో… రంగా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయని భావించారట ఆయన అభిమానులు. కానీ… అలాంటిదేమీ లేకపోగా…. కూటమి పెద్దలు జయంతి రోజున కనీసం గుర్తు చేసుకోలేదంటూ… ఓ వర్గం అసంతృప్తిగా ఉందట. రాధా టీడీపీలో ఉండి, ఎన్నికల సమయంలో కూటమి గెలుపు కోసం పూర్తి స్థాయిలోపనిచేసినా కూడా రంగాను గుర్తు చేసుకోకపోవటం ఏంటంటూ.. గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచాక కూడా కూటమి ప్రభుత్వం రాధాకు ఏ పదవీ ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్న రంగా అభిమానుల్ని…. ఈ ఎపిసోడ్ మరింత బాధ పెడుతోందట. టీడీపీ సంగతి సరే… కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు రియాక్ట్ అవలేదన్న చర్చ జరుగుతోందట వంగవీటి అభిమానుల మధ్య. రంగా జయంతి రోజున కనీసం ట్వీట్ కూడా పెట్టకపోవటాన్ని ప్రత్యేకంగా చూడాలని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Sheikh Hasina: మనస్సాక్షి ప్రకారం అప్పగించండి.. షేక్ హసీనాపై భారత్‌కు బంగ్లాదేశ్ కొత్త ప్రతిపాదన
కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ఎన్నికలకు ముందు అనేక కార్యక్రమాల్లో రంగా గురించి, ఆయన గొప్పతనం గురించి పదే పదే చెప్పారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక జయంతిపై కనీసం ట్వీట్ చేయకపోవడాన్ని తేడాగానే చూడాలంటున్నారటన్నారట రంగా అభిమానులు. సెలబ్రిటీల పుట్టిన రోజుల గురించి ఎక్స్ మెసేజ్‌లు పెడుతున్న పవన్… పదే పదే ఎన్నికలకు ముందు స్మరించిన దివంగత నేత గురించి మాత్రం స్పందించకపోవడం ఏంటన్న చర్చ కాపు సామాజికవర్గంలో సైతం జరుగుతోందంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఈసారి రంగా జయంతిపై ఎక్స్‌లో మెసేజ్ పెట్టారు. గత కొన్నేళ్ళుగా రంగా గురించి స్పందించని జగన్…ఇప్పుడు మెసేజ్ పెట్టడం, అదే సమయంలో కూటమి నుంచి స్పందనలు లేకపోవడం పొలిటికల్ హాట్ అయింది. రంగాను ఎన్నికల సమయంలో ఓటు బ్యాంక్‌గా కాకుండా అన్ని సందర్బాల్లో స్మరించుకోవాలన్నది ఆయన అభిమానుల ఆకాంక్షగా తెలుస్తోంది.