ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నా ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ మండిపడింది. నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
అవినీతి, అసమర్థ నాయకుని పాలన ఎలా ఉంటుందో జగన్ ను చూస్తే అర్డంవుతుందన్నారు అనిత. వైసీపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకే నారీ సంకల్ప దీక్ష చేపట్టాం అన్నారు. పాదయాత్రలో తల నిమిరి ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి రాగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. అమ్మ,చెల్లికే న్యాయం చెయ్యలేని జగన్.. రాష్ట్ర మహిళకు ఏమి న్యాయం చేస్తారు..? నెల్లూరుకు చెందిన పొణకా కనకమ్మ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళా పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.
దూబగుంట రోసమ్మ పోరాట పటిమను అందరూ ప్రదర్శించాలి. రాష్ట్ర మహిళలు పడుతున్న కష్టాన్ని వివరించేందుకే నెల్లూరు వచ్చా. రాష్ట్ర మహిళల భద్రత తన బాధ్యత అన్న జగన్… మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు..? చీప్ లిక్కర్ తాగొచ్చి.. భర్త చేతిలో చావు దెబ్బలు తింటున్న ప్రతి మహిళా చైతన్యం కావాలి.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు.. ఓట్లు అడుక్కునేందుకు త్వరలో పీకే టీమ్ రాబోతుంది. ప్రభుత్వాన్ని కూడా స్వార్థంతో.. బిజినెస్ మైండ్ తో నడుపుతూ ఉన్నారని జగన్‌పై విమర్శలు చేశారు అనిత. తల్లికి, చెల్లికి విలువ ఇవ్వలేని జగనన్నకు మహిళల సమస్యలు అర్థమవుతాయా..? వంటింట్లో ఉన్న మహిళలకు డ్వాక్రా సంఘాలు చంద్రబాబు ఏర్పాటు చేస్తే.. డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారన్నారు.