Attack on Vande Bharat Train: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీయబోతోంది. ఒకే రైలు రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ నడిపేందుకు సిద్ధమయ్యారు.. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేశారు.. అయితే, ఇండియన్ రైల్వేస్ 2019లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది.. క్రమంగా.. వివిధ రూట్లలో ఈ రైళ్లను పట్టాలెక్కిస్తోంది.. అయితే, విశాఖలో వందే భారత్ ట్రైన్ బోగీలపై రాళ్లదాడి జరిగింది.. కంచరపాలెంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వందే భారత్ ట్రైన్‌పై రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసం అయ్యినట్టు తెలుస్తోంది..
Read Also: Fire Accident in Sankranthi Celebrations: స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు.. భోగి మంటల్లో అపశృతి
ట్రయిల్ రన్‌లో భాగంగా చెన్నై నుండి విశాఖకు వచ్చింది వర్షన్ 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. దీనిపై దాడికి పాల్పడ్డారు దుండగులు.. ఈ ఘటనతో అప్రమత్తం అయిన రైల్వే అధికారులు ఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు.. వందేభారత్ ట్రైన్ పై రాళ్లదాడి నిజమేనని చెబుతున్నారు వాల్తేర్ డివిజన్ అధికారులు.. కాగా, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో ప్రారంభం కానున్న వందే భారత్ ట్రైన్.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ ఎంట్రీతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు తగ్గిపోనుంది. అయితే, ఆదిలేనే.. అది కూడా ప్రారంభానికి నోచుకోకముందే.. రైలుపై రాళ్ల దాడి జరగడంతో అప్రమత్తం అయిన రైల్వే పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..