Vande Bharat Train: మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వార్తల్లో నిలిచింది. గతంలో పలుమార్లు ఈ రైలులో వడ్డించిన భోజనంలో దుర్వాసన రావడం, బొద్దింకలు, ఇతర కీటకాలు రావడంపై రైల్వే శాఖ విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఫిబ్రవరి 1న రాణి కమలాపతి నుంచి జబల్ పూర్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.
Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వే త్వరలో కాన్సెప్ట్ రైలును తీసుకురానుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అత్యాధునిక స్లీపర్ బోగీలతో అమర్చబడుతుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం (అక్టోబర్ 3) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్ డిజైన్ కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.
Vande Bharat Express: భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకువచ్చింది. ఇప్పటికే 60 పైగా వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. రానున్న కాలంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ట్రాక్ ఎక్కనున్నాయి. ఇదిలా ఉంటే కొందరు మాత్రం ఈ రైళ్లు టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. రైళ్లపై రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా నమోదయ్యాయి.
Kishan Reddy: అక్టోబర్ ఒకటి న మహబూబ్ నగర్ కి, అక్టోబర్ 3న నిజామాబాద్ కి ప్రధాని మోడీ వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పలు రైల్వే అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసే అవకాశం ఉందన్నారు.
వందే భారత్ రైలు ప్రయాణీకులకు సౌకర్యాన్ని కల్పిస్తోంది. సమయాన్ని ఆదా చేస్తోంది. దీంతో ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ నివేదిక విడుదలైంది. కాసర్‌గోడ్-త్రివేండ్రం వందే భారత్ రైలు ప్రయాణికుల ఆదరణలో అగ్రస్థానాన నిలుస్తోంది.
Vande Bharat Train: కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు దేశంలోని అనేక ప్రాంతాల్లో రైల్వే ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.
Vande Bharat Train: వందే భారత్ రైలు ప్రమాదం తప్పింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తీక్యాతండా సమీపంలోని రైలు పట్టాల వద్ద చోటుచేసుకుంది. మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో స్టాప్ లేకపోవడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ రైలు అదే వేగంతో నడుస్తోంది.
కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. అనంతరం సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 1 నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.