వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య నడుస్తుంది. రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్-గార్ల రైల్వేస్టేషన్ల మధ్య వందేభారత్ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్: విశాఖపట్నం నుంచి వందేభారత్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read : Organs Donating : అవయవదానం చేయండి.. శిక్ష తగ్గించుకోండి
రాళ్ల దాడిలో రైలు సీ-8 కోచ్ అద్దాలు పగిలిపోయాయని, అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శుక్రవారం (ఫిబ్రవరి 3) సాయంత్రం ఖమ్మం రైల్వేస్టేషన్ దాటిన వెంటనే ముగ్గురు గుర్తు తెలియని యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు కోచ్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Also Read : TikTok Layoff: భారత దేశంలోని తన సిబ్బందిని తొలగించిన టిక్ టాక్