GVL Narasimha Rao Travels In Vande Bharat Train: దేశంలోని రైలు ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ప్రధాని మోడీ ఆలోచనతో వచ్చిందే వందే భారత్ ట్రైన్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌కు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం అందులో ఏలూరు వరకు ప్రయాణించిన జీవీఎల్.. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఈ వందే భారత్ ట్రైన్‌ని కేంద్రం తీసుకొచ్చిందని అన్నారు. ఏసీ బస్సుల్లో ప్రయాణానికి ఎంత చార్జీ అవుతుందో, అంతే చార్జీలతో ఈ అత్యాదునిక ట్రైన్లలో ప్రయాణించవచ్చని తెలిపారు. విదేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే రైలు చార్జీలు చాలా తక్కువ అని చెప్పారు. విదేశాల్లో ప్రీమియం ట్రైన్ చార్జీలు.. విమాన చార్జీల కంటే ఐదు రెట్లు అధికంగా ఉంటాయని.. మన దేశంలో నడుస్తున్న వందే భారత్ ట్రైన్ చార్జీలు ఫ్లైట్ చార్జీల్లో 4వ వంతు మాత్రమేనని స్పష్టం చేశారు.
Marriage: వివాహంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలాగా అంటారా!
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మొదటి దశ వందే భారత్ ట్రైన్లు ఏర్పాటు చేసిన తర్వాత.. రెండవ ఫేజ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని వందే భారత్ ట్రైన్లు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని జీవీఎల్ హామీ ఇచ్చారు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తీసుకొచ్చిందన్నారు. మొదట హైదరాబాదు నుంచి విజయవాడ వరకే ప్రతిపాదన ఉండేదని.. ఆ తర్వాత విశాఖ వరకూ దాన్ని పొడిగించామని చెప్పారు. అత్యంత వేగవంతమైన అధునాతన సౌకర్యాలతో ఈ రైలును సిద్ధం చేశామన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని.. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా త్వరలో విజయవాడ రైల్వేస్టేషన్ను కూడా ఆధునికీకరిస్తామని తెలియజేశారు.
Libraries : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు