Vande Bharat trains: దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. భారత రైల్వేకు ఆధునిక హంగులు తీసుకురావడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 8 వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
READ ALSO: Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగు మృతి
ముంబై-షోలాపూర్, ముంబై- షిర్డీ మార్గాల్లో ఈ కొత్త రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ముంబై-షోలాపూర్ వందే భారత్ ట్రైన్ 9వది కాగా, ముంబై-షిర్డీ వందేభారత్ ట్రైన్ 10వది. ఈ మార్గాల్లో ప్రయాణికులకు మరింతగా కనెక్టివిటీ పెరగనుంది. షోలాపూర్ లోని సిద్ధేశ్వర్, అక్కల్ కోట్, తుల్జాపూర్, పంధర్ పూర్, పూణే సమీపంలోని అలండి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తులు వెళ్లడానికి మెరుగైన సదుపాయం ఏర్పడనుంది. వందేభారత్ ట్రైన్ ద్వారా ముంబై-షిరిడీల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. షిరిడీతో పాటు శని సింగనాపూర్ పుణ్యక్షేత్రాలను సందర్శించడాన్ని సులభతరం చేస్తుంది.
వీటితో పాటు ముంబై మరోల్ లో అల్జామియా-తుస్-సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. అల్జామియా-తుస్-సైఫియా దావూదీ బోహ్రా కమ్యూనిటీ యొక్క ప్రధాన విద్యా సంస్థ. రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించడానికి ప్రధాని మోదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మరోల్ కార్యక్రమానికి వెళ్లనున్నారు.