ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసరనేని వెంకట పాండురంగారావు పై గత ఏడాది జరిగిన దాడికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు వంశీ..
రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్‌లో పరామర్శించిన జగన్.. ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు..
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో విచారణను ఏపీ పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం హైదరాబాద్, విశాఖ పట్నంకు ఏపీ పోలీస్ ప్రత్యేక బృందాలు వెళ్లాయి. నిందితులు ఉపయోగించిన రెండు కార్లు గుర్తించే పనిలో పడ్డారు పోలిసులు.
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం కోర్టులో బెజవాడ పోలీసులు పిటిషన్ దాఖలు వేశారు. సత్య వర్ధన్ నుంచి 164 స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని పోలీసులు పిటిషన్ లో కోరారు.
Vallabhaneni Vamsi Mobile: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో రెండవ రోజు పడమట పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ ఈ రోజు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సబ్ జైల్లో తన భార్తకు ప్రాణహాని ఉందన్నారు.
Vallabaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు. వంశీ మొబైల్ కోసం పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులో ఆధారాల సేకరణ నిమిత్తం హైదరాబాద్ కి రెండు పోలీస్ బృందాలు వెళ్లాయి. ఇప్పటికీ వంశీ మొబైల్ ఫోన్ దొరకలేదు.. దీంతో స్థానిక రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో సెల్ ఫోన్ కోసం గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, పోలీసుల పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. వంశీ అరెస్ట్ సక్రమంగా జరగలేదన్న ఆమె.. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే తెలుస్తోంది.. అరెస్ట్ అక్రమం అనేది కూడా స్పష్టం అవుతోందన్నారు.. ఇక, తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మెజిస్ట్రేట్‌కి వంశీ తెలిపారని గుర్తుచేశారు.. పోలీస్‌స్టేషన్‌లో వంశీ పట్ల పోలీసులు తప్పుగా ప్రవర్తించారు.. నా భర్త అరెస్ట్‌పై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు వల్లభనేని వంశీ…