గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
Vallabhaneni Vamsi: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు 8 గంటల పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. విజయవాడలోని నాల్గవ అదనపు న్యాయమూర్తి ముందు వంశీని పోలీసులు ప్రవేశ పెట్టారు.
Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తదుపరి చర్యలపై అతడి తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచనలు కొనసాగిస్తున్నారు.
YSRCP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై ఫిర్యాదు చేసేందుకు మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను వైసీపీ బృందం కలవడానికి వెళ్లింది. అయితే, డీజీపీ అందుబాటులో లేరని.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేక సమావేశానికి వెళ్లారని కార్యాలయ సిబ్బంది పేర్కొనింది. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా కనీసం ఏ అధికారి మా రెప్రజెంటేషన్ ను కూడా తీసుకోవడం లేదని వైసీపీ బృందం ఆరోపించింది.
Ambati Rambabu: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వంశీ టీడీపీ కార్యాలయ దాడి ఘటనలో బెయిలుపై ఉన్నారు.. ఆయన అరెస్టు పట్ల అందరం దిగ్భ్రాంతి చెందాం.. టీడీపీ దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మెజిస్ట్రేట్ వద్దకు వెళ్ళి తాను అసలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు..
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగం వల్లభనేని వంశీ అని మండిపడిన ఆయన.. వంశీ తల్లి, చెల్లి కూడా ఈ మృగాన్ని శిక్షిస్తేనే సమాజానికి మంచదని అనుకుంటున్నారని పేర్కొన్నారు.. వంశీతో పాటు మరో నాలుగైదు జంతువులు కూడా ఊచలు లెక్కపెట్టి తీరాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
గన్నవరం తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ ఆఫీస్‌ని తగలబెట్టిన కేసులో సీన్ ఎందుకు రివర్స్ అయింది? అధికారంలో ఉండి కూడా ఫిర్యాదు దారుడిని కాపాడుకోలేకపోయారా? టీడీపీ పెద్దలు వల్లభనేని వంశీని లైట్ తీసుకుని బోల్తా పడ్డారా? గన్నవరం గరం గరంకు కారకులెవరు? ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజక వర్గాల్లో గన్నవరం ఫస్ట్ లిస్ట్‌లో ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ… 2019-…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టులో దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, వంశీ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు .