గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఏదో… కేసు పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా… రెడ్ బుక్ రేంజ్‌లో ఆయన్ని బుక్ చేసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? ఆయన ముఖ్య అనుచరుల మీద తాజా కేసులు, కొన్ని అరెస్ట్‌లే అందుకు సంకేతాలా? నియోజకవర్గానికి దూరంగా ఇప్పుడు వంశీ ఏం చేస్తున్నారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగించటానికి రంగం సిద్ధమవుతోందట. ఓ పద్ధతి ప్రకారం తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం…
విజయవాడలో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగు కార్లలో వంశీ ఇంటి వద్దకు వచ్చిన యువకులు.. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో గేట్లు పగులగొట్టే ప్రయత్నం చేశారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే క్యాండిడెట్ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.
గన్నవరం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్‌లో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివేకం కలిగిన నాయకుడు అని అనుకున్నాను.. పాలసీ పరంగా విబేధాలు ఉంటే మాట్లాడవచ్చు.. కానీ, దానికి ఒక పరిమితి ఉంటుంది.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ జనసేనకి, ఎమ్మెల్యే తనకు ఓటు వేయాలని వంశీ కోరుతున్నారట…
మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు అని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని నేను ముందే చెప్పాను.. నాకు వంశీ, కొడాలితో సత్సంబంధాలే ఉంటే నేను ఎందుకు చెబుతాను? అని ప్రశ్నించారు. వంశీ, నానితో సంబంధంలేదని నా పిల్లల మీద ప్రమాణాలు చేసి చెబుతున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో ఏడవ జాబితాపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో.. సీఎంవో నుంచి పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఈరోజు సీఎంవో కార్యాలయానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
వైసీపీకి గుడ్ బై చెప్పేశారు యార్లగడ్డ వెంకట్రావు.. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారు.. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు.. 2019లో సరిపోయిన నా బలం.. ఇప్పుడు సరిపోదా అంటూ నిలదీశారు.