Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం కోర్టులో బెజవాడ పోలీసులు పిటిషన్ దాఖలు వేశారు. సత్య వర్ధన్ నుంచి 164 స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని పోలీసులు పిటిషన్ లో కోరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్య వర్ధన్ ఫిర్యాదుదారుడిగా ఉన్నారు.
Read Also: Rashmika: రష్మిక పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కన్నడ ఇండస్ట్రీ
అయితే, గత వారం తనకి ఈ కేసుతో సంబంధం లేదని కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్టు కోర్టులో సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేశాడు. దీంతో సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేసి వంశీ ఆయన అనుచరులు బెదిరించడంతోనే కేసును వాపస్ తీసుకున్నాడని సత్య వర్ధన్ సోదరుడు కిరణ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేశారు. దీంతో కిడ్నాప్ జరిగిన విషయంపై సత్యవర్ధన్ నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం 4వ ఏసీఎంఎం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ కేసుపై విచారణకు నేడు లేదా సోమవారం నాడు న్యాయమూర్తి అనుమతి ఇస్తే మెజిస్ట్రేట్ ముందు సత్యవర్థన్ ను ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు.