Kanpur: తన కూతురితో కలిసి తిరుగుతున్న యువకుడిపై ఓ తండ్రి దారుణంగా వ్యవహరించాడు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌కి చెందిన లాయర్ తన కుమార్తెతో కలిసి తిరుగున్న ఫార్మా విద్యార్థిని కిడ్నాప్ చేయించి, అతని మనుషులతో దారుణంగా చిత్రహింసలు పెట్టాడు.
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్‌లకు వ్యసనంగా మారి ఓ యువకుడు తన అమ్మమ్మన్ను హత్య చేశాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై మండిపడ్డారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీ గోండా జిల్లాలోని కత్రా శివదయాల్గంజ్ స్టేషన్ సమీపంలో నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి.. అనంతరం చంపేశాడు. ఈ హత్యలో బాలిక సవతి తండ్రి ప్రమేయం కూడా ఉంది. కాగా.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత.. అసలు విషయం బయటపడింది. పోస్ట్‌మార్టం నివేదికలో సాధు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా గుర్తించారు.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం యూపీలోని హర్దోయ్‌లో వెలుగు చూసింది. పోస్ట్‌మార్టం నిర్వహించే రూమ్‌లో.. చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి.. వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఓ పక్క కుటుంబ సభ్యులు బాధతో ఉంటూ.. పట్టించుకోవడం కరువైంది. ఈ క్రమంలో.. బంగారు నగలను కొట్టేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు వారి బండారం బయటపడింది. ఓ మహిళా కానిస్టేబుల్ సోదరి మృతి చెందడంతో పోస్టుమార్టం రూమ్‌లో జరుగుతున్న ఈ…
Physical relations: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఓ మహిళ, తన అత్తగారిపై సంచలన ఆరోపణలు చేసింది. అత్తగారు బలవంతంగా శారీరక సంబంధం పెటుకోవడంతో సహా హింస, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పేపర్ లీకులను అరికట్టేందుకు సీఎం యోగి నేతృత్వంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు లీకులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకురాబోతోంది.
Leech Found In Nose: మామూలుగా "జలగ" అంటే చాలా మంది భయపడుతుంటారు. నీటిలో చాలా సేపు గడిపినప్పుడు శరీర భాగాలను అంటిపెట్టుకుని రక్తాన్ని తాగుతుంటుంది. చాలా సందర్భాల్లో మనకు జలగ కుడుతున్న విషయం కూడా తెలియదు. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ముక్కులో జలగ కొన్ని రోజులుగా ఉంటున్న అరుదైన కేసు నమోదైంది.