Barabanki Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాబంకి-బహ్రైచ్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో యాత్రికులను తీసుకెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. గోండాలోని దుఖ్హరన్ నాథ్ మహాదేవ్ ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Also Read: Viral Video: ఢిల్లీ…
Chhangur Baba: ఉత్తరప్రదేశ్‌ను కుదిపేస్తున్న అక్రమ మతమార్పిడుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంగూర్ బాబా వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. లక్నోలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (PMLA) కోర్టు సోమవారం చంగూర్ బాబాకు సన్నిహితుడిగా భావిస్తున్న నవీన్ రోహ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి అప్పగించింది. నవీన్ గతంలో యుపీ ఎటీఎస్ అరెస్ట్ చేసి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తు కోసం కోర్టులో కస్టడీ కోరగా, కోర్టు అందుకు ఆమోదించింది. ఇందులో భాగంగా…
ఉత్తరప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం క్షణం క్షణం పెరుగుతోంది.
ప్రియరాళ్ల కోసం ప్రేమికులు ఎంతకైనా తెగిస్తుంటారు. అర్ధరాత్రి.. అపరాత్రి అనకుండా చాటుగా వచ్చి కలిసి వెళ్తుంటారు. అదే ఓ ప్రేమికుడి పాలిట శాపమైంది. ప్రియురాలిని కలిసేందుకు గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
దేశంలో రోజురోజుకు మహిళల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లనే కాటికి పంపేస్తున్నారు. మొన్నటికి మొన్న మీరట్‌లో భర్తను చంపి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసింది ఓ ఇల్లాలు.
Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్లో రైలు టిక్కెట్లు కొనడంపై జరిగిన వాగ్వాదంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్‌పై కన్వారియాలు(శివభక్తులు) దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ దేశంలోనే తొలిసారి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలనను మరింత సాంకేతికతతో కూడిన, పారదర్శకంగా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని భారతీయ సాంకేతిక సంస్థ (IIT) కాన్పూర్ ప్రొఫెసర్లు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతులు ఆగస్టులో జరగనున్న మాన్సూన్ సమావేశం మధ్యలో లేదా చివరిలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా AI శిక్షణా…
ఇవాళ లక్నోలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడినా సామూహిక మత మార్పిడికి పాల్పడిన సూత్రధారి జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా.. నేను నిర్దోషిని, నాకు ఏమీ తెలియదన్నారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.