ఓ అన్న చెల్లెలికి మరణశాసనం రాశాడు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థినికి చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. చదువుకోకుండా ప్రేమ వ్యవహారం నడిపించడంతో సోదరుడు జీర్ణించుకోలేక చెరువులో ముంచి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
భర్త బాధితులే కాదు.. ప్రస్తుత కాలంలో భార్య బాధితులు కూడా ఎక్కువై పోతున్నారు. భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. కాగా ఓ భర్త తన భార్య పై చేసిన ఆరోపణలు అందరిని షాక్ కు గురిచేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అధికారులకు ఒక వింత ఫిర్యాదు వచ్చింది. అది వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాధాన్ దివాస్ కింద ఒక కేసును విచారిస్తున్నప్పుడు, ఒక ఫిర్యాదుదారుడు తన భార్య రాత్రిపూట పాములాగా మారి తనను…
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సినిమా తరహాలో ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. స్నేహితుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. అనంతరం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బంగారం ధరలేమో భగ్గుమంటున్నాయి. కొనాలంటే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ బంగారం కొనేందుకు షాప్ కు వెళ్లి చేతివాటం ప్రదర్శించింది. కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా అనుకుందో ఏమోగాని మొత్తానికి రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కాజేసింది. దీనికి సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో చోటు చేసుకుంది. Also Read:AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ..…
Uttar Pradesh: జీవిత చరమాంకంలో తనకు తోడుగా ఉంటుందని 75 ఏళ్ల సంగ్రామ్ సింగ్ అనే వృద్ధుడు, 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, వివాహం జరిగిన తర్వాత ఉదయమే చనిపోవడం విషాదకరంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుచ్‌ముచ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. Read Also: Off The Record: చిరంజీవి అవమానం విషయంలో వైసీపీ నేతల నోళ్లు అప్పుడేమయ్యాయి..? తన మొదటి భార్య ఒక ఏడాది క్రితమే మరణించింది. అప్పటి…
Bulldozer Action: ఇటీవల ‘‘ ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా అల్లర్లకు కారణమైంది. బరేలీలో గత శుక్రవారం ప్రార్థనల తర్వాత గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఆ తర్వాత, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ అల్లర్లు కౌశాంబి, కాన్పూర్‌లతో పాటు గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి వివిధ ప్రదేశాలకు వ్యాప్తించాయి. అయితే, ఈ అల్లర్లకు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇత్తేహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ (IMC) అధ్యక్షుడు తౌకీర్ రజా ఖాన్‌ను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్…
CM Yogi: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. రెండు రోజుల క్రితం శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం మూక రాళ్ల దాడికి పాల్పడింది.
ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బరేలీ స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ‘ఐ లవ్ ముహమ్మద్’ మద్దతుగా నిరసనలకు శుక్రవారం పిలుపునిచ్చారు.
UP: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం బరేలీలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 4న ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్‌తో ఉన్న టెంట్‌ను పోలీసులు తొలగించిన తర్వాత కాన్పూర్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఒక మతపెద్ద మెమోరాండం సమర్పించాలని ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా శుక్రవారం ప్రార్థనల తర్వాత బరేలీలోని ఇస్లామియా మైదానం సమీపంలో భారీగా జనాలు గుమిగూడారు.