Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌లో జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు రోజురోజుకు వెలుగులోకి వస్తు్న్నాయి. హిందూ అమ్మాయిలే లక్ష్యంగ మతమార్పిడి ముఠాను యూపీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చంగూర్ బాబాకు మతమార్పిడిల కోసం మిడిల్ ఈస్ట్‌లోని పలు ఇస్లాం దేశాల నుంచి నిధులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా మతమార్పిడిల కోసం వందల కోట్లు సేకరించినట్లు తేలింది.
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మత మార్పిడిలే లక్ష్యంగా ఈ ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు యూపీ పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల నిధులు సంపాదించాడు. ముఖ్యంగా 40 బ్యాంక్ అకౌంట్లలో రూ. 106 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
Crime: 45 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి కాని వ్యక్తి, తనకు 18 ఎకరాలు ఉందని అయినా వధువు దొరకలేదని తన బాధను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహరాజ్‌కు చెప్పుకోవడం అతడి చావుకు కారణమైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ, పార్ట్‌టైమ్ టీచర్, రైతుగా పనిచేస్తున్నారు. అయితే, అతను వధువు కోసం నిరాశ వ్యక్తం చేసిన వీడియో వైరల్ కావడంతో, అతడికి ఉన్న 18 ఎకరాలను కొట్టేయాలని మోసగాళ్లు…
Shocking : ఇది పబ్జీ ప్రేమ కథ కాదు.. పరస్పర నమ్మకాలను తాకే సోషల్ మీడియా రిలేషన్షిప్ హెచ్చరికగా మారిన ఘటన. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ కోసం ఓ మహిళ తన కుటుంబాన్ని వదిలేసింది. మరోవైపు, ఆన్లైన్ పరిచయాన్ని నిజ జీవిత బంధంగా మలచేందుకు యువకుడు వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. బాంద్ జిల్లాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022లో శీలు…
Yogi Adityanath: కన్వర్ యాత్రకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (జూన్ 26న) కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడుకోవడంతో పాటు భక్తుల మనోభావాలను గౌరవించడం అవసరమని నొక్కి చెప్పారు.
Faridabad: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలతో కలిసి ఓ మహిళను దారుణంగా చంపేశారు. మురుగు కాల్వ కోసమని గొయ్యి తవ్వి కోడలు శవాన్నీ అందులో పూడ్చి పెట్టేశారు. ఆపై కోడలు ఎవరితోనో లేచిపోయిందని అసత్య ప్రచారం చేసారు.
2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఎన్కౌంటర్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలోని చాలా మంది ప్రమాదకరమైన నేరస్థులు పోలీసు ఎన్కౌంటర్లలో మరణించారు. పెద్ద సంఖ్యలో నేరస్థులు గాయపడ్డారు.
రానురాను వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. అప్పటికే పెళ్లై పిల్లలున్నవారు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు. తమకిష్టమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు కట్టుకున్న వారిని కాటికి పంపిస్తున్నారు. కాగా కొందరు భర్తలు తమ భార్యల ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు తెలుసుకుని అతగాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లైన 13 ఏళ్లకు భార్య ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో ఆమె భర్త…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం అయ్యారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఉన్న యూపీ సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది.. ఘన వ్యర్థాల ప్లాంట్ల అధ్యయనం కోసం లక్నో పర్యటనకు వెళ్లింది మంత్రి నారాయణ బృందం.. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత యూపీ సీఎం, అధికారులతో మంత్రి నారాయణ, ఏపీ అధికారుల భేటీ అయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడిపించడంతో అది కాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి తీసుకుపోయింది. కాగా, కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లాడు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో.. కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది.