Illicit affair: సమాజంలో కొందరి ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటోంది. వావీవరసలు మరిచి ప్రవర్తిస్తున్న తీరు మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇవి హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో కూడా ఇలాంటి ఓ సంఘటన జరిగింది. అత్తగారితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ అడవుల్లో ఇద్దరు పారా కమాండోలు మిస్సింగ్..
ఈ వారం ప్రారంభంలో, సిధ్‌పురా లోని ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆ ఇంట్లో నుంచి 20 ఏళ్ల శివాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శివానికి 2018లో ప్రమోద్ అనే వ్యక్తితో వివాహమైంది. ప్రమోద్‌కు తన అత్తతో అక్రమ సంబంధం ఉందని శివాని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయం తరుచుగా వారి కుటుంబంలో వివాదాలకు దారి తీసినట్లు చెప్పారు.
కుటుంబ సభ్యులు అక్రమ సంబంధం గురించి ఆరోపిస్తుండటంతో పలుమార్లు ప్రమోద్, శివానిపై హింసకు పాల్పడ్డాడు. ఆమె హత్యకు ముందు కూడా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే శివానిని నిందితులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత ప్రమోద్, అతడి కుటుంబీకులు అక్కడి నుంచి పారిపోయి పరారీలో ఉన్నట్లు సమాచారం. హత్య తర్వాత, ప్రమోద్, అతడి అత్తలకు సంబంధించిన అనేక అసభ్యకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో స్థానికంగా వైరల్ గా మారాయి. పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు గాలింపు ప్రారంభించారు.