Karwa Chauth: కర్వా చౌత్ ఉత్తరాది రాష్ట్రాలు నిర్వహించే ఓ హిందూ పండగ. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తుంటారు. పెళ్లి అయిన మహిళలు, తమ భర్త దీర్ఘాయుష్యు కోసం, ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకు ఎలాంటి నీటిని తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. చంద్రుడిని చూసిన తర్వాత, భర్త చేతుల మీదుగా ఉపవాసాన్ని ముగిస్తారు.
Read Also: Muslim Ccountry Bans Hijab: ముస్లిం దేశంలో బుర్ఖా నిషేధం.. ఇస్లామిక్ దేశాల్లో ఈ దేశం తీరే వేరు!
ఇదిలా ఉంటే, ఇప్పుడు యూపీ ఆగ్రాకు చెందిన ఓ కుటుంబం కర్వా చౌత్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆగ్రాలోని ఎత్మదౌలా ప్రాంతంలో ఒక వ్యక్తి తన ఇద్దరు భార్యలతో కలిసి పండగ జరుపుకున్నాడు. అతడి ఇద్దరు భార్యలు కలసి ఉపవాసం చేసి, కలిసి విరమించారు. ఈ ఫోటోలపై జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రామ్ బాబు నిషాద్ తన భార్యలు షీలా, మన్ను దేవిలతో కలిసి ఈ ఫోటోలు షేర్ చేశారు. వీటిని చూసిన బ్యాచ్‌లర్స్ తమకు వివాహం కూడా కాలేదని, ఇద్దరు భార్యలతో ఎలా సంతోషంగా ఉంటున్నావు బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
రామ్ బాబు దాదాపు పదేళ్ల క్రితం షీలా దేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలం తర్వాత అతను మన్నూ దేవితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయంపై ఇంట్లో వివాదాలు రాకుండా, భార్యతో సహా ఇతర కుటుంబీకుల్ని ఒప్పించి మన్నూదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ముగ్గురూ కూడా ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు. ప్రేమ ఉన్న చోట గొడవలకు చోటు లేదని రామ్ బాబు చెబుతున్నాడు.
आगरा में करवाचौथ पर एक पति की दो पत्नियों ने साथ में व्रत रखा। पति ने दोनों को साथ में पानी मिलाकर उपवास तुड़वाया। युवक और उसकी दोनों पत्नियों का साल 2023 में भी वीडियो वायरल हुआ था। #KarwaChauth #agra pic.twitter.com/JapVYgpYZk
— Pawan Kumar Sharma (@pawanks1997) October 11, 2025