కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే సురక్షిత మార్గం కావడంతో దేశంలో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. వంద కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వ్యాక్సిన్‌పై అవగాహన లేక వ్యాక్సిన్ తీసుకొవడానికి చాలా ప్రాంతాల్లోని ప్రజలు ముందుకు రావడంలేదు. వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ అందిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది.
Read: జాతీయరహదారులపై రన్‌వేలు… ఇదే కారణం…
ఇక ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని అహేర్ గ్రామంలోని ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు అధికారులు ఆ గ్రామానికి వెళ్లారు. అలా వెళ్లిన అధికారులకు నిరాశ ఎదురైంది. టీకా వేసేందుకు ఆరోగ్యశాఖాధికారులు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసుకొని పరారయ్యారు. దీంతో గ్రామంలో మైక్‌లతో టీకా ప్రయోజనాలకు ప్రచారం చేశారు. అధికారుల సహాయంతో ప్రజలకు అవగాహన కల్పించి ఎట్టకేలకు ఆ గ్రామంలోని 122 మందికి వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు తెలిపారు.