Theft Case: దొంగతనం చేస్తే శిక్ష తప్పదు. అయితే చిన్నమొత్తంలో చోరీ చేస్తే ఎక్కడైనా పోలీసులు దండించి వదిలిపెట్టేస్తారు. మళ్లీ తప్పు చేయవద్దని హెచ్చరిస్తారు. అయితే రూ.45 దొంగతనం చేసినందుకు న్యాయస్థానం నాలుగురోజుల జైలుశిక్ష విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా 24 ఏళ్లకు ముందు జరిగిన ఈ చోరీ కేసులో ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడం గమనించదగ్గ విషయం. వివరాల్లోకి వెళ్తే.. 1998, ఏప్రిల్ 17వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మైన్‌పురి ఛపట్టీ…
Another girl was killed in Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరో బాలికను హత్య చేశారు. ఔరయ్యా జిల్లా దిబియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని నగ్నంగా గుర్తించారు పోలీసులు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మరణంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు మృతదేహంతో పారిపోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను తన…
Mulayam Singh Yadav's condition critical: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం ఆయన్ను గురుగ్రామ్ లోని మెదాంత ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. 82 ఏళ్ల ములాయం సింగ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్యంపై సమాచారం అందిన వెంటనే ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ హుటాహుటిన లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
Asaduddin Owaisi assault case అసదుద్దీన్ ఓవైసీ హత్యా నిందితులకు బెయిల్.. యూపీ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టుఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ పర్యటిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై ఇద్దరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు తాజగా బెయిల్ లభించింది. అయితే వారికి బెయిల్ లభించడాన్ని సవాల్ చేస్తూ అసదుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్…
Dalit Student Dies After Alleged Assault By Teacher in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తప్పుగా పదం ఉచ్ఛరించాడని ఓ ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిపై తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ.. విద్యార్థి మరణించారు. ఈ ఘటన ఔరయ్యా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల దళిత విద్యార్థి 10 తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఇటీవల పరీక్షలో ఒక పదం తప్పుగా…
Uttar Pradesh has passed a bill to prevent anticipatory bail in rape cases: అత్యాచార నిందితులపై ఇక మరింత కఠినంగా వ్యవహరించనుంది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( యూపీ సవరణ) బిల్లు-2022ను ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సభలో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, మహిళపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు…
Heavy rains in Delhi: ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర జీవితం మొత్తం అతలాకుతలం అయింది. గురువారం రోజు భారీ వర్షాలు కురవడంతో జనజీవితం స్తంభించింది. భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. శుక్రవారం కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Food served to kabaddi players in the toilet: ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో ఆహారం అందిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 16న సహరాన్ పూర్ బాలికల అండర్ -17 రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దీన్ని చిత్రీకరించి…
Muslim couple married in Hindu style: భారత పర్యటనలో ఉన్న ఓ అమెరికన్ ముస్లిం జంట హిందూ సంప్రదాయాలకు ఫిదా అయ్యారు. అప్పటికే ముస్లిం పద్ధతిలో వివాహం చేసుకున్న వీరిద్దరు మరోసారి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వారిద్దరికి నిఖా జరిగిన 18 ఏళ్ల తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.