SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Preparation Tips: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది యువతకు సరైన ప్రిపరేషన్ వ్యూహం ఎంతో కీలకం. ఎంత కష్టపడి చదివినా సరైన మార్గదర్శకత్వం లేకపోతే ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. ఈ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన అనుభవజ్ఞులైన నిపుణులు SSC పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో మూడు కీలక దశలను వివరించారు. అవి ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. SSC అనేది ఒకే పరీక్ష కాదని అభ్యర్థులు ముందుగా గుర్తించాలి. SSC CGL, CHSL, MTS, GD, CPO, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ వంటి పలు పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. వీటికి అర్హతలు, ఉద్యోగ బాధ్యతలు, పోస్టింగ్, జీతం, పని విధానం వేర్వేరుగా ఉంటాయి.
సిలబస్, పరీక్షా విధానంపై పూర్తి అవగాహన
అందుకే అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఆసక్తులు, ఉద్యోగ ప్రాధాన్యతలను ముందుగా అంచనా వేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు CGL వంటి పరీక్షలను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. 12వ తరగతి అర్హతతో CHSL వంటి పరీక్షలకు సిద్ధం కావచ్చు. యూనిఫాం ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు CPO, GD వంటి పరీక్షలను పరిశీలించాలి. డెస్క్ జాబ్ కావాలా? ఫీల్డ్ వర్క్ ఇష్టమా? పోస్టింగ్ ఎక్కడ కావాలి? వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పరీక్షను ఎంచుకున్న తర్వాత సిలబస్, పరీక్షా విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం రెండో ముఖ్యమైన దశ. ఇందుకోసం అభ్యర్థులు అధికారిక SSC వెబ్సైట్లో తాజా నోటిఫికేషన్‌ను పరిశీలించి.. సిలబస్, పరీక్షా విధానం, అర్హతలు వంటి వివరాలను నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను విశ్లేషించడం చాలా అవసరం. ముఖ్యంగా గత 2 నుంచి 4 సంవత్సరాల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఏ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి? ఏ టాపిక్కు ఎక్కువ వెయిటేజ్ ఉంది? ప్రశ్నల క్లిష్టత ఎలా ఉంది? వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. దీంతో ప్రిపరేషన్‌కు సరైన దిశ ఏర్పడుతుంది.
Also Read
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ముందుగా ఒక బేస్‌లైన్ మాక్ టెస్ట్ రాయండి
ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ఎలాంటి సన్నాహం లేకుండా ఒక మాక్ టెస్ట్ రాయడం మూడో కీలకమైన దశ. దీనివల్ల ప్రస్తుతం మీ సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఏ సబ్జెక్టులో బలంగా ఉన్నారు? ఎక్కడ బలహీనంగా ఉన్నారు? ప్రశ్నలను పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతోంది? నెగెటివ్ మార్కింగ్ వల్ల ఎంత నష్టం జరుగుతోంది? వంటి విషయాలను సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఈ మాక్ టెస్ట్‌లలో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. అదే స్కోర్‌ను బేస్‌లైన్‌గా తీసుకుని, ప్రిపరేషన్‌తో క్రమంగా మెరుగుపడటమే ముఖ్యమని వెల్లడించారు. మాక్ టెస్టుల ద్వారా ఏ ప్రశ్నలను ప్రయత్నించాలి? దేనిని వదిలేయాలి? సమయాన్ని ఎలా కేటాయించాలి? వంటి అంశాలపై కూడా అభ్యర్థులకు మంచి అవగాహన వస్తుందన్నారు. అధికారిక SSC వెబ్‌సైట్‌తో పాటు పలు ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న మాక్ టెస్టులు, గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షకు మరింత సమర్థవంతంగా సిద్ధం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. SSC ఉద్యోగం సాధించాలంటే కేవలం గంటల కొద్దీ చదవడం మాత్రమే సరిపోదు. ముందుగా సరైన పరీక్షను ఎంచుకోవడం, సిలబస్-ప్యాటర్న్‌ను అర్థం చేసుకోవడం, బేస్‌లైన్ మాక్ టెస్ట్‌తో తమ స్థాయిని తెలుసుకోవడం.. ఈ మూడు దశలను పాటిస్తే ప్రిపరేషన్‌కు స్పష్టమైన దిశ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!