Girl Killed By Wild Wolf In Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. సుల్తాన్ పూర్ లోని ఓ గ్రామంలో అడవి తోడేలు 18 నెలల బాలికపై దాడి చేసి చంపినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి బల్దిరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్ముసి గ్రామంలో జరిగింది. ప్రతీ అనే ఏడాదిన్నర బాలిక స్థానికం ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసుకున్న గుడారంలో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న సమయంలో అడవి తోడేలుదాడి చేసింది. ఈ సమయంలో బాలికను తోడేలు ఎత్తుకెళ్లింది.
Read Also: Nitish Kumar: “నాకు ఒకే కల మిగిలి ఉంది”.. కేసీఆర్ సభపై నితీష్ కుమార్..
ఈ ఘటన జరిగిన విషయం కూడా బాలిక తల్లిదండ్రులకు తెలియదు. అయితే రాత్రి సమయంలో బాలిక తండ్రి నిద్రలేచి చూసే సరికి బిడ్డ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు బాలక కోసం వెతికారు. కొంత మంది గ్రామస్తులు బాలికను చంపి తోడేలు తింటుందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులను చూసి తోడేలు పారిపోయిందని.. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంబేద్కర్ నగరలోని స్వగ్రామనికి తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.