Stone Pelting: చిచ్చుపెట్టిన చికెన్..! రెండు వర్గాల మధ్య దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stone Pelting: చికెన్ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.. పరస్పరం దాడులకు వరకు వెళ్లింది వ్యవహారం.. ఇంతకీ చికెన్ ఏంటి? రెండు వర్గాల మధ్య దాడులకు ఎందుకు దారితీసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది… సోమవారం రాత్రి అలీగఢ్‌లోని సరాయ్ సుల్తానీలో ఉన్న ఓ మాంసం దుకాణానికి కొందరు యువకులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెళ్లారు.. అయితే, ఆ సమయంలో చికెన్ విక్రయించే వ్యక్తి, ఆ యువకులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అది కాస్త గొడవకు దారితీసింది.. దీంతో, పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సాస్నిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరాయ్ సుల్తానీ చౌకీ సమీపంలోని జరిగిన రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణలో.. ఆకాష్, సిద్ధార్థ్, నరేష్ గౌతమ్ అనే ముగ్గురు యువకులు గాయపడ్డారు. కొన్ని కార్ల అద్దాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన యువకులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Passenger Train: విశాఖలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..
Also Read
మరోవైపు, రాళ్ల దాడి చాలాసేపు కొనసాగడంతో ఐజీ దీపక్‌కుమార్, డీఎం ఇంద్ర విక్రమ్ సింగ్, ఎస్‌ఎస్పీ కళానిధి నైతానీ, పీఏసీతోపాటు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌ల అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గాయపడిన యువకుల బంధువులు, వారి మద్దతుదారులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇక, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చికెన్ షాపును మూసివేయాలని డిమాండ్ చేశారు.. అయితే, గతంలో చాలా సార్లు ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అకస్మాత్తుగా గుంపు మరోసారి రెచ్చిపోయి కౌంటర్‌ను ధ్వంసం చేశారని.. ఇతర వర్గాలకు చెందిన గుంపు సుల్తాన్ కీ సరాయ్ వీధి నుండి రాళ్లు రువ్వడం ప్రారంభించిందని చెబుతున్నారు.. అయితే, మరోసారి పోలీసుల ముందే ఘర్షణ చోటు చేసుకుంది.. మళ్లీ రాళ్ల దాడి జరిగింది. ఎలాగోలా ఇరువర్గాలను మళ్లీ శాంతింపజేశారు. ఐజీ దీపక్‌కుమార్ మైక్‌ని చేతిలోకి తీసుకుని వీధిలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఎస్పీ కళానిధి నైతానీ, ఐజీ దీపక్‌కుమార్‌లు ఫిర్యాదు మేరకు చర్యలకు ఉపక్రమించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు