గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా యూపీ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటు అయ్యిందని, ఇప్పుడు అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ ఈడీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లపై ఈడీ…
రోజురోజుకు దేశంలో నేరాలు-ఘోరాలు పెరిగి పోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడంతో లేదు. ఏదొక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది.
UP: ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్లో శనివారం బుర్ఖా ధరించిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఒక హిందూ అబ్బాయితో బైక్పై ప్రయాణిస్తున్న ముస్లిం అమ్మాయిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు బాధితులు కూడా బ్యాంక్లో పనిచేస్తున్నారు. లోన్
PM Modi: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలది కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి పెడతారని విమర్శించారు.
UP: తన భార్య, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసిన ఓ భర్త, ఇకపై తాను ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను హత్య చేసే అవకాశం ఉందని, మీరట్లో జరిగినట్లు డమ్ముల్లో ముక్కలు అవ్వడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలోని మౌరానిపూర్లో జరిగింది. ప్రభుత్వ బాలికల కళాశాలలో గుమస్తాగా పనిచేస్తున్న రీతు వర్మ అనే మహిళ స్థానిక కౌన్సిలర్ అభిషేక్ పాఠక్తో…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో 19 ఏళ్ల బాలికపై 23 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి, వారందరినీ రిమాండ్కు పంపారు. బుధవారం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ విదుష్ సక్సేనా ఈ మేరకు సమాచారం అందించారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లాల్పూర్ పాండేపూర్ ప్రాంతంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు…
'వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..' ఈ మాటలు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది కదూ.. కానీ ఈ డైలాగ్ వెనక ఉన్న పూర్తి విషయం తెలిస్తే అవాక్కవుతారు. పెళ్లికి ముందు అత్త, అల్లుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలోని మద్రక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లుడు తన పెళ్లికి ముందే తన కాబోయే అత్తగారితో పారిపోయాడు. ఈ సంఘటన…
UP: ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ పట్టణంలో ‘‘మీరట్’’ తరహా మర్డర్ సంచలనంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం భార్యనే భర్తను చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిజ్నోర్ నజీబాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. రైల్వే టెక్నీషియన్గా పనిచేస్తున్న దీపక్ కుమార్ని అతడి భార్య శివాని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భర్త గుండెపోటుతో మరణించినట్లు ముందుగా శివాని చెప్పింది. Read Also: Punjab: బీజేపీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి.. పాకిస్తానీతో సహా…
UP: ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహాలో 26 ఏళ్ల షబ్నమ్ అనే మహిళ, ఇంటర్ విద్యార్థితో సంబంధం పెట్టుకుని, అతడిని పెళ్లి చేసుకుంది. తన రెండో భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలి అతడిని వివాహమాడింది. దీనిపై స్థానికంగా చాలా విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్, మతాల నేపథ్యం, షబ్నమ్ పిల్లల్ని, భర్తని విడిచిపెట్టాలనే నిర్ణయం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.