Acid Attack: “నువ్వు నాకు దక్కకపోతే, ఎవరికి దక్కొద్దు”.. పెళ్లికి ముందు యువతిపై యాసిడ్ దాడి..
- ‘‘నువ్వు నాకు దక్కకుంటే, ఎవరికి దక్కద్దు’’..
- పెళ్లికి ముందు యువతిపై యాసిడ్ దాడి..
- ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack: మరికొన్ని రోజుల్లో యువతి పెళ్లి, ఇంతలోనే ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ చెందిన 25 ఏళ్ల యువతిపై ఒక యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆపి ‘‘నువ్వు నాకు దక్కకుంటే, మరెవరికి దక్కకూడదు’’ అంటూ ఆమెపై యాసిడ్ పోశారు. ఉత్తర్ ప్రదేశ్ మౌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బాధితురాలు, ఆమె కుటుంబం వివాహానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆమె తండి చనిపోవడం, సోదరుడు చిన్నవాడు కావడంతో యువతి సొంతగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటోంది. అయితే, యువతితో రిలేషన్‌లో ఉన్న నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్, ఆమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
Read Also: Pakistan: సింధు నది పేరుతో, పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం..
గురువారం యువతి బ్యాంక్ నుంచి రూ. 20,000 డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మే 27న ఆమె పెళ్లిని ఆపాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. యువతి ముఖం, భుజం, మెడ, శరీరంపై ఇతర భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. దాడి జరిగిన తర్వాత ఆమెను గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తరలించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అజంగఢ్ లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 60 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు చెప్పారు.
నిందితుడు పటేల్‌తో పాటు మరో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం, ఆమె వివాహం రద్దు అయింది. యువతి వివాహాన్ని అడ్డుకునేందుకు ఆమె వీపుపై యాసిడ్ పోయాలని అనుకున్నట్లు నిందితుడు పోలీసులతో చెప్పాడు. గత నెలలో యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య వివాహ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య, ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ దాడి చేశాడు.
తాజావార్తలు
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!