Husband Wife Dies Same Day: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం యుగంలో భర్తను భార్య, భార్యను భర్త చంపుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. కానీ.. ఇక్క మాత్రం జీవితాంతం కలిసి జీవించిన భార్యాభర్తలు మరణంలోనూ తోడుగా నిలిచారు. మొదట భార్య మరణించింది. దాదాపు 12 గంటల తర్వాత.. భర్త కూడా లోకాన్ని విడిచాడు. ఇద్దరి చితులను పక్కపక్కనే ఉంచి…
UP: తన భార్య వేరే వ్యక్తితో లేచిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. తన నలుగురు పిల్లలతో కలిసి అను యమునా నదిలోకి దూకినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం తన భార్యతో జరిగిన వివాదం తర్వాత సల్మాన్ ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడు. దూకడానికి ముందు తన వీడియోను రికార్డ్ చేసి, తన సోదరి గులిస్టాకు పంపాడు. తన భార్య ఖుష్నూ, ఆమె లవర్ తన ఆత్మహత్యకు బాధ్యులు…
UP Blast: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్‌లో శనివారం అకస్మాత్తుగా జరిగిన పేలుడు తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్‌పూర్ మండి రోడ్‌లోని ఒక భవనంలో ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో భవనం పైకప్పుతో సహా అనేక భాగాలు ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు పగిలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి…
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఫిట్ నెస్ కోడలు రోజు జిమ్ కు వెళుతుంది. వెళ్లేటపుడు మాత్రం ఆభరణాలు అన్ని వేసుకుని వెళుతుంది. ఇది నచ్చని అత్త ఆ నగలు కొట్టేసేందుకు ప్లాన్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…. ముజఫర్‌నగర్ జిల్లాలోని పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్‌పూర్ గ్రామంలో పూజా అనే మహిళ జిమ్ కు ఆభరణాలు పెట్టుకుని వెళ్లింది. ఆమె అత్త రేఖకు ఇది నచ్చలేదు. జిమ్ కు వెళ్లే అలవాటు పట్ల ఆమె…
Floating Stone: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో గంగా నది నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. ఈ పెరుగుతున్న నీటి మట్టంతో సహా చాలా వస్తువులు తేలుతూ వస్తున్నాయి. కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద ఉదయం ఒక రాయి తేలుతూ కనిపించింది.
Twist : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లా అస్మోలి ప్రాంతంలో సోషల్ మీడియా ద్వారా అసభ్యతను ప్రోత్సహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహక్, పరిలు అనే ఇద్దరు యువతులు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, వారి ఇద్దరు సహచరులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యంగా, అశ్లీలతతో కూడిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారని పోలీసులకు స్థానికుల నుంచి వరుస ఫిర్యాదులు అందాయి. వీరిని సంభల్ పోలీసులు అరెస్ట్ చేసి, జైల్లోకి తరలించారు. సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న ‘మహక్ పరిచ 143’…
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లోని ప్రభాత్ మార్కెట్లో జరిగిన ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శతాక్షి హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న 55 ఏళ్ల వాచ్మెన్ రవీంద్ర భారీ ఇనుప గేటు కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు. ఈ భయంకరమైన దృశ్యం షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఓ నూతన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయిందని భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నూతన వివాహితను పట్టుకున్నారు. ఆమెను కుటుంబీకులకు అప్పగించారు.