Hindu Girl Forced Conversion: ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్ జిల్లా బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు మైనర్ ముస్లిం బాలికలపై కేసు నమోదు అయింది. హిందూ బాలికను బురఖా ధరించమని బలవంతం చేసినట్లు, అలాగే ఆమెను మతం మారాలని ఒత్తిడి చేసినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన 2025 డిసెంబర్ 12వ తేదీన చోటు చేసుకున్నప్పటికీ, ఇటీవలే వెలుగులోకి వచ్చింది. బాధితురాలి అన్న దక్ష్ చౌదరి (16) బిలారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఐదుగురు బాలికలు చదువుతున్న పాఠశాలతో పాటు ఒకే ట్యూషన్ క్లాస్‌లో హాజరయ్యేవారు.. దీంతో వారు ఆమెను బురఖా ధరించమని, ఇతర మతం స్వీకరించమని ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు.
Read Also: Office Friends: 70 మంది ఆఫీస్ దోస్తులను పెళ్లికి పిలిస్తే ఒక్కరే హాజరు.. నిరాశతో జాబ్ రిజైన్!
కాగా, ఈ కేసు ఉత్తరప్రదేశ్ మతమార్పిడి నిరోధక చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 5(1) కింద నమోదు అయింది. ఈ చట్టం ప్రకారం మోసం, బలవంతం, బెదిరింపు, అనుచిత ప్రభావం లేదా ఆకర్షణ ద్వారా జరిగే మతమార్పిడిని నేరంగా పరిగణిస్తుంది. ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మత మార్పిడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. వీడియోలో ఇరుకైన వీధిలో హిందూ బాలిక బురఖా ధరించగా, మిగతా బాలికలు ఆమె దుస్తులపై బురఖాను సరిచేస్తూ కనిపిస్తున్నారు. వారు రెస్టారెంట్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన అన్న చూసేస్తాడేమో అన్న భయంతో బాధితురాలు బురఖా ధరించిందని పోలీసులు తెలిపారు.
Read Also: Hyderabad: ప్రైవేట్ స్కూల్‌లో.. ఇంటర్వ్యూ కి పిలిచి యువతిపై లైంగిక వేధింపులు..
ఇక, గ్రామీణ ఎస్పీ కున్వర్ ఆకాశ్ సింగ్ మాట్లాడుతూ.. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల ఉద్దేశం, ఘటన వెనుక ఉన్న కారణాలను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే, ఈ చట్టం ప్రకారం మైనర్లకు సంబంధించిన మతమార్పిడి కేసుల్లో దోషులుగా తేలితే కనీసం ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు కఠిన శిక్ష విధించవచ్చని హెచ్చరించారు. నిందితులందరూ మైనర్లు కావడంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకోలేదని.. ఈ ఘటనపై బలవంతంగా చేశారా అనే అంశంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
FIR Filed Against 5 Muslim Students in Moradabad For Allegedly Forcing Hindu Girl To Wear Burqa#Moradabad | FIR registered against 5 Muslim students in Billari police station area for allegedly forcing a Hindu girl student to wear a burqa. The incident reportedly took place on… pic.twitter.com/lDmbjapqfE
— Atulkrishan (@iAtulKrishan1) January 23, 2026