UP: వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు.. తలపై నుంచి దూసుకెళ్లిన వ్యాన్ (వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో హృదయ విదారక సంఘటన జరిగింది. స్కూల్ వ్యాన్ ఢీకొని రెండున్నరేళ్ల చిన్నారి విషాదకరంగా మరణించింది. బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్‌పూర్ గ్రామంలో ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE: Star Hero : హిట్ కోసం ఆపసోపాలు పడుతున్న స్టార్ హీరో.. రంగంలోకి సీనియర్ దర్శకులు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
పోలీసుల కథనం ప్రకారం.. ఎప్పటిలాగే పిల్లలను తీసుకెళ్లడానికి గ్రీన్ పబ్లిక్ స్కూల్ వ్యాన్ గ్రామానికి వచ్చింది. వీధిలో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల కేశవ్ అకస్మాత్తుగా వ్యాన్ ముందు పరిగెత్తాడు. డ్రైవర్ బాలుడు గమనించలేదు. ఫలితంగా, స్కూల్ వ్యాన్ ముందు చక్రం అమాయక బాలుడిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన బాలుడి తండ్రి శుభమ్ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ కేశవ్ మరణించాడు. ఈ సంఘటన తర్వాత.. పోలీసులు అక్కడికి చేరుకుని, స్కూల్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. పోస్ట్‌మార్టం తర్వాత సాయంత్రం ఆలస్యంగా బాలుడి మృతదేహం ఇంటికి చేరుకుంది. విగత జీవిగా పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఓ బుధానా గజేంద్ర పాల్ సింగ్ తెలిపారు.
READ MORE: Pakistan: పాకిస్తాన్ నేవీ హెచ్చరిక.. సర్‌క్రీక్ సమీపంలో దాయాది యుద్ధ విన్యాసాలు..
रिपोस्ट करे 🚨🚨
ये मामला मुज़फ्फरनगर के बुढ़ाना कसबे के ग्राम उमरपुर का जहाँ एक गली में स्कूल वेन के ड्राइवर ने खेलते हुए 2 साल के बच्चे के ऊपर दो बार गाड़ी चढ़ाई !
बच्चे की मौत के बाद पुलिस ने FIR में की लीपा पोती घुस खोरी की आशंका I
आशंका है The Green public school ने पुलिस… pic.twitter.com/bttWkDXkjX— AS SONI (@assoni_mzn) November 1, 2025
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!