Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
- నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర
- వెలుగులోకి షాకింగ్ విషయాలు
- సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనీస వేతనాలు పెంచాలంటూ నోయిడా కార్మికులు ఆందోళనకు దిగారు. డిమాండ్ల కోసం రోడ్డెక్కడం తప్పేమీ కాదు. కానీ నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అవాక్కైంది. సోమవారం వేతనాల కోసం రోడ్డెక్కిన కార్మికులు.. కానీ అంతలోనే రణరంగంగా మారిపోయింది. ఆస్తులు ధ్వంసం చేయడం, వాహనాలు తగలబెట్టడం క్షణాల్లో తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు రంగం ప్రవేశం చేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో పోలీస్ శాఖ షాక్‌కు గురైంది.

Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
అయితే నోయిడా రణరంగంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే ఆందోళనలపై ఆరా తీయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్మికుల నిరసనల్లోకి బయట వ్యక్తులు ప్రవేశించినట్లుగా ప్రభుత్వానికి పోలీసులు నివేదించారు. నోయిడా ఘర్షణల వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని ఉత్తర ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ ఆరోపించారు. పాకిస్థాన్ ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

ఇక నిన్నటి ఆందోళనల్లో ప్రమేయం ఉన్న 300 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వంద మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఫ్యాక్టరీల్లో ఉన్న సీసీ కెమెరాలను, రహదారులపై ఉన్న కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. బయట వ్యక్తులు ఎలా ప్రవేశించారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ కుట్ర జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కార్మికులకు యోగీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 21 శాతం కార్మికుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా కూడా నేడు కూడా పలుచోట్ల కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!