Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్‌కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 7:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో యశ్ ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా సందడి నెలకొంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా యశ్‌ను సరికొత్త లుక్, పాత్రలో చూడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
‘టాక్సిక్’ ట్రైలర్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ట్రైలర్లో యశ్ పాత్ర ఎలా ఉండబోతుంది? కథ ఏ నేపథ్యంలో సాగుతుంది? నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అనే విషయాలపై ఇప్పుడు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘టాక్సిక్’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని వెంకట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె నారాయణతో కలిసి హీరో యష్‌కు చెందిన మన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదలకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో సోషల్ మీడియాలో #ToxicTrailer ట్రెండ్ అవుతోంది. సాయంత్రం 7:01 గంటలకు ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
తాజావార్తలు
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!