కేసీఆర్ తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేశారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేశారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నల్గొండలోని దేవర కొండలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ పార్టీని ఉత్తమ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 100 కోట్లు ఖర్చుపెట్టిన రియల్ వ్యాపారిని ఓడించి నన్ను గెలిపించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం వారసులమన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా కాంగ్రెస్ నిలబెట్టిందన్నారు. అటు మోడీ, ఇటు కేసిర్ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్ఠు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ఒక్కసారి వడపర్తి వచ్చి చూడు సీఎం కేసీఆర్..కోమటి రెడ్డి ప్రశ్నల వర్షం
Also Read
సోనియావల్లనే తెలంగాణ వచ్చింది.. రాజకీయంగా నష్టపోయి సోనియా తెలంగాణ ఇచ్చిందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. మతపరంగా విభజించి మోడీ, మోసాలతో కేసీఆర్ పరిపాలిస్తున్నారన్నారు. అన్ని రకాలుగా మోసం చేసిన కేసిర్, ఇప్పుడు దళిత బంధు అంటూ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. దళితబంధుకు 1 లక్ష 70 వేల కోట్లు కావాలి, కానీ కేసీఆర్ 25 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏక కాలంలో రుణమాఫీ చేస్తే, ముదనాష్టపు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిందని, టీఆర్‌ఎస్ రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోవని ఉత్తమ్ విమర్శించారు. ఈ ప్రాంతలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన గుత్తా, కేసీఆర్ కాళేశ్వరానికి అన్ని నిధులు వెచ్చించి పూర్తి చేస్తే, కేవలం 3000 కోట్లు ఎస్సెల్బీసీకి విడుదల చేయించి పూర్తి చేయలేకపోయాడని ఆగ్రహించారు. రాష్ట్రంలో ముందస్తు ఖాయమని ఉత్తమ్ జోస్యం చెప్పాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!