తైవాన్ పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. జియాంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక రాజ్యాధికార కాంక్ష పెరిగిపోయింది. ఆర్ధిక, సైనిక శక్తిని పెంచుకున్నది. తన దేశాన్ని విస్తరించుకోవాలని చైనా చూస్తున్నది. చుట్టుపక్కల దేశాల సరిహద్దుల్లో రోడ్డు, భవనాలు, ఇతర మౌళిక వసతుల నిర్మాణాల ఏర్పాటు పేరుతో ప్రవేశిస్తు అక్కడ బలాన్ని పెంచుకొని ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది చైనా. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో అత్యధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వాటిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటోంది.
ఇప్పుడు తన పక్కనే ఆనుకొని ఉన్న తైవాన్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నది. చైనా చర్యలపై తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి ముప్పు రోజు రోజుకు పెరిగిపోతోందని అన్నారు. తైవాన్ ఓడిపోతే ప్రపంచ డెమొక్రసీకి విఘాతం కలుగుతుందని, తమని, తమ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రపంచానిదే అన్నారు. తైవాన్ విషయంలో ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా తైవాన్‌పై దాడి చేస్తే తైవాన్‌కు అనుకూలంగా పోరాటం చేస్తామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పిన సంగతి తెలిసిందే. బైడెన్ హెచ్చరికల తరువాత కూడా చైనా వెనక్కి తగ్గకపోగా మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. ఇటు భారత్‌లోని లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో టెన్షన్ పూరిత వాతావరణాన్ని పెంచుతోంది చైనా.
Read: సరికొత్త ఐడియా: వారి కష్టాలను తీర్చేందుకు… చిన్నారి ఏం చేసిందంటే…