అమెరికాతో సహా పలు దేశాలు చైనాను హెచ్చరిస్తున్నప్పటికీ తైవాన్ విషయంలో వెనక్కి తగ్గడంలేదు. తైవాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు లేదని, ఆ దేశం చైనాలో కలిసిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యూ జీ 20 దేశాల సదస్సులో ఈ విషయాన్ని తెలియజేశారు. వన్ చైనాను 50 ఏళ్ల క్రితమే అమెరికా అడ్డుకోలేకపోయిందని, ఈ విషయంలో ఎవరు అడ్డు తగలాలని చూసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా స్పష్టం చేసింది. ఇప్పటికే టిబెట్, హంకాంగ్ దేశాలను తమ ఆధీనంలో పెట్టుకున్న చైనా చాలా కాలంగా తైవాన్‌ను ఆక్రమించుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశానికి ఐరాసలో గుర్తింపు లేకపోవడంతో ఎలాగైనా దాన్ని ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, ఐరాసలో తైవాన్‌కు గుర్తింపు ఇచ్చేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. ఒకవేళ డ్రాగన్ దేశం తైవాన్‌పై సైనిక దాడికి దిగితే, తాము తైవాన్ కు అండగా ఉంటామని, ఆ దేశం తరపున పోరాటం చేస్తామని ఇప్పటికే అమెరికా హామీ ఇచ్చింది. చైనా నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయిని, తమను రక్షించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలదే అని తైవాన్ అధ్యక్షురాలు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్దాలు రావాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఈసారి యుద్ధం అంటూ వస్తే వినాశనం భారీగా ఉంటుంది.
Read: వేడెక్కుతున్న గోవా… ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న పార్టీలు