ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడాలని నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన సమావేశం అప్పట్లలో అర్థాంతరంగా ముగిసింది. ఆ తరువాత కూడా కిమ్‌తో ట్రంప్ టచ్‌లోనే ఉన్నారు. అణ్వాయుధాలను విడనాడే విధంగా చేసుందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అంతలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మాజీ అయిపోయారు.
Read: Ukraine Crisis: పెరుగుతున్న ఉద్రిక్తతలు… పోలెండ్ కు మరో 3 వేల మంది సైనికులు
అయినప్పటికీ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడితో టచ్‌లో ఉన్నారని న్యూయార్క్ టైమ్స్‌కు రిపోర్టర్ మాగీ హెబర్మన్ తాను రాసిన ది కాన్ఫిడెన్స్ మ్యాన్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. తనకు అందిన సమాచారం మేరకు పుస్తకంలో పేర్కొన్నానని చెప్పడం విశేషం. 1799 లోగన్ చట్టం ప్రకారం ప్రజలు ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశీ ప్రభుత్వాలతో సంబంధాలు కలిగిఉండటం నేరంగా పరిగణిస్తారు. ఉత్తరకొరియాతో ట్రంప్ సంబంధాలపై యూఎస్ ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవలే ఫ్లోరిడాలోని ట్రంప్ గృహంలో 15 బాక్సుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో చాలా వరకు అత్యంత రహస్య పత్రాలు ఉన్నాయని సమాచారం.