ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో నాటో దళాలను పెంచడంతో రష్యా కూడా దానికి ధీటుగా బలగాలను పెంచుతున్నది. లైవ్ ఫైర్ డ్రిల్స్ కోసం రష్యా తన దళాలను బెలారస్ కు తరలించింది. నాటో దళాలను ఎదుర్కొనేందుకు రష్యా వ్యూహాలు రచిస్తున్నది. పరిస్థితులు మారిపోతుండటంతో అమెరికా తన పౌరులను వెంటనే వెనక్కి వచ్చేయ్యాలని ఆదేశించింది. అయితే, తమ పౌరులకు రక్షణ కల్పించేందుకు ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపేది లేదని, ఒకవేళ అమెరికన్ సైనికులు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి రష్యా సైనికులతో తలపడితే అది ప్రపంచయుద్దానికి దారి తీస్తుందని జో బైడెన్ పేర్కొన్నారు.
Read: Viral: పాము కాటుకు ఆవు పేడతో వైద్యం… వికటించడంతో…
అలా జరగడం ఎంతమాత్రం ఇష్టం లేదని అన్నారు. నాటో దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే తాము నల్లసముద్రం, అజోవ్ సముద్రాల్లో సౌనిక విన్యాసాలకు సిద్దమౌతున్నామని రష్యా చెబుతున్నది. రష్యా సైన్యం చేస్తున్న యుద్ధ విన్యాసాలపై నాటో ఆందోళన చేస్తున్నది. యూరప్ కు ఇది ప్రమాదకరమైన క్షణం అని పేర్కొన్నది. రష్యా హైబ్రీడ్ వార్‌కు తెరలేపుతున్నదని ఉక్రెయిన్ ఆరోపిస్తున్నది.