రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సమస్య రోజురోజుకు జఠిలం అవుతున్నది. క్రియాను రష్యా అక్రమించుకున్నాక ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా భారీ ఎత్తున సైన్యాన్ని ఆయుధాలను మోహరించింది. అయితే, ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా నాటో దళాలు రంగంలోకి దిగాయి. నాటో దళాలు రంగంలోకి దిగడంపై రష్యా స్పందించింది. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని, నాటో దళాలతో పోలిస్తే రష్యా సైన్యం తక్కువే అని, కానీ, అణ్వాయుధవ్యవస్థ బలంగా ఉన్న దేశం రష్యా అని అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. రష్యాసార్వభౌమత్వానికి, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు యూరప్, నాటో దేశాలు కట్టుబడి ఉండాలని అన్నారు.
Read: హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపే కుట్ర
రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా కీలక అడుగులు వేస్తున్నది. రష్యాను స్విఫ్ట్ నుంచి బయటకు పంపాలని చూస్తున్నది. స్విఫ్ట్‌లో వందకు పైగా సభ్యదేశాలు ఉన్నాయి. ఇక దేశం నుంచి మరోక దేశాలని డబ్బు లావాదేవీలు బ్యాంకు ద్వారా జరిగినపుడు స్విఫ్ట్ బ్యాంక్ సందేశాలను ఖాతాదారుడికి పంపుతుంది. ఈ స్విఫ్ట్ నుంచి రష్యాను బయటకు పంపితే బయట దేశాల నుంచి రష్యాకు నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో రష్యా కేవలం దేశీయ ఇన్వెస్టర్ల పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, స్విఫ్ట్ నుంచి రష్యాను బయటకు పంపేందుకు జర్మనీ ఇష్టపడటం లేదు. రష్యాను బయటకు పంపితే ఆ దేశం నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని జర్మనీ భయం. గ్యాస్ మాత్రమే కాదు, ఆయిల్ సరఫరా నిలిచిపోతుంది. యూరప్ దేశాలకు ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ సరఫరా జరుగుతుంది. అయితే, అమెరికా మాత్రం రష్యాను ఎలాగైనా స్విఫ్ట్ నుంచి బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.