ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రమైనవి కుక్కలు. యజమానుల యెడల అవి చూపే ప్రేమ అంతా ఇంతా కాదు. చాలా మంది కుక్కలను తమ సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. యజమానులు రిస్క్‌లో ఉన్నప్పుడు కుక్కలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే, కుక్కలు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వాటిని కాపాడుకోవడం యజమానులు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. యూఎస్ లోని కొలరాడోలోని పోలీసులకు ఓ కాల్ వచ్చింది. కారులో మంటలు చెలరేగాయని, వెంటనే రావాలని పోలీసులకు సమాచారం అందింది. కాల్ అందుకున్న వెంటనే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన గ్రిగోరెక్ హుటాహుటిన అక్కడికి వెళ్లాడు.
Read: టాబ్లెట్స్ పౌడర్.. నార్కోటిక్ డ్రగ్స్ అంటూ మోసం
అప్పటికే కారులోనుంచి దట్టమైన పొగ వస్తున్నది. అయితే, అందులో హ్యాంక్ అనే కుక్క చిక్కుకుందని యజమాని చెప్పడంతో కారు సైడ్ డోర్ అద్దం బ్రేక్ చేశారు. ముందు వైపు దట్టమైన పొగ కమ్మేయడంతో డోర్ ఓపెన్ చేయడం సాధ్యం కాలేదు. వెంటనే వెనక్కి వెళ్లి డోర్ అద్దాన్ని బ్రేక్ చేశారు. ముందు ఉన్న హ్యాంక్ వెనక్కి వచ్చేసింది. హ్యంక్‌ను చూసిన యజమాని హడావుడిగా దానిని బయటకు తీసు ప్రయత్నం చేశాడు. కానీ, సాధ్యం కాలేదు. వెంటనే దట్టమైన పొగ వస్తున్నా ప్రాణాలకు తెగించి పోలీస్ ఆఫీసర్ గ్రిగోరెక్ ఆ కుక్కను బటయకు తీసి ఎత్తుకొని వెళ్లి రోడ్డు పక్కన ఉన్న మంచులో వేశాడు. ఈ దృశ్యాలన్ని గ్రిగోరెక్ బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను కొలరాడో పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 4.2 బిలియన్ మంది వీక్షించగా, 8100 లైక్‌లు, 955 కామెంట్లు వచ్చాయి. పోలీస్ చేసిన సాహసాన్ని నెటిజన్లు శభాస్ పోలీస్ అంటూ మెచ్చుకున్నారు.