ఉత్తర కొరియా గత దశాబ్దకాలంగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఆయుధాలను తయారు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సొంతంగా క్షిపణులను తయారు చేసుకుంటూ దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలను భయపెడుతున్నది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఏ క్షపణిని ప్రయోగిస్తారో తెలియక చుట్టుపక్కల దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తర కొరియా సముద్రంలోని అల్‌సామ్ దీవుల్లో ఓ పెద్ద రాయి ఉన్నది. దీనిని ఉత్తర కొరియా మోస్ట్ హేటెట్ రాక్ అని పిలుస్తారు. దీనిని టార్గెట్ చేసి నార్త్ కొరియా క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. షార్ట్ రేంజ్ క్షిపణులు, లాంగ్ రేంజ్ క్షిపణులు ఎక్కువగా ఈ అల్‌సామ్ రాక్‌ను డీకోడుతుంటాయి. క్షిపణీ ప్రయోగాలకు అల్‌సామ్ దీవుల్ని వినియోగించుకుంటుందని దక్షిణ కొరియా ఆరోపిస్తున్నది.
Read: అదిరిపోయే ఫీచర్స్ తో ఇండియాలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్… కేవలం 4 గంటల్లోనే
ఉత్తర కొరియాలోని నార్త్ ఈస్ట్రన్ తీరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అల్‌సామ్ ద్వీపం. 2019 నుంచి ఇప్పటి వరకు 25 క్షిపణులను ఈ రాక్‌ను టార్గెట్ చేసుకొని ప్రయోగించారు. 2022 జనవరిలో 8 క్షిపణులను ఈ రాక్‌ను టార్గెట్ చేసి ప్రయోగించినట్టు నిపుణులు చెబుతున్నారు. క్షిపణీ ప్రయోగాలు మానుకోవాలని, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నార్త్ కొరియా అణ్వాయుధ ప్రయోగాలను వీడాలని అమెరికా హెచ్చరిస్తున్నా ఉత్తర కొరియా తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికే అనేక దేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. అటు ఐక్యరాజ్య సమితి కూడా ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆంక్షలు విధించినప్పటికీ ఖాతరు చేయడం లేదు.