Israel-Hamas War: అమెరికాను కొట్టేది ఒక్కడే, అతనే కిమ్.. నార్త్ కొరియా అధినేతపై హమాస్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో నిలిచేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దీని తర్వాత నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ఉగ్రవాదులతో సహా 9000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయిల్ తో పోరుకు హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లు కాలుదువ్వుతున్నారు.
ఇదిలా ఉంటే వరసగా హమాస్, హిజ్బుల్లా కీలక నాయకులు ఇజ్రాయిల్, అమెరికాలను కవ్విస్తున్నారు. తాజాగా హమాస్ కీలక నేత అలీ బరాకా అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై దాడి చేయగల ఉత్తర కొరియా సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రపంచంలో అమెరికాను కొట్టగల సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ అని అన్నారు.
Also Read
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
Read Also: Humaira Himu: బంగ్లాదేశ్ నటి హుమైరా హియు అనుమానాస్పద మృతి
పాలస్తీనియన్లకు, హమాస్‌కి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ మద్దతుపై అడగ్గా అలీ బరాకా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాది అంతా గతమే అని.. అమెరికా, బ్రిటన్‌లు సోవియట్ యూనియన్ లాగే కూలిపోతాయని, అమెరికా శక్తివంతంగా ఉండదని ఓ ఇంటర్వ్యూలో హమాస్ నేత చెప్పారు. ఇరాన్ గురించి మాట్లాడుతూ.. అమెరికాపై దాడి చేసే సామర్థ్యం ఇరాక్‌కి లేదని అన్నారు.
ఒక వేళ ఇరాన్ జోక్యం చేసుకోవాలని అనుకుంటే.. అది ఇజ్రాయిల్, ఆ ప్రాంతంలోని అమెరికన్ స్థావరాలపై దాడి చేయగలదు, ఇరాన్ వద్ద అమెరికాను చేరుకోగలిగే ఆయుధాలు లేవు, కానీ ఇజ్రాయిల్, అమెరికన్ స్థావరాలు, యుద్ధనౌకలపై దాడులు చేయగలదు. అయితే ఉత్తర కొరియాకు అమెరికాపై దాడి చేయగలిగే సామర్థ్యం ఉంది, అది జోక్యం చేసుకునే రోజు రావచ్చనరి, ఎందుకంటే ఆ దేశం మా కూటమిలో భాగమని బరాకా అన్నారు. అమెరికా శత్రువులందరూ దగ్గరవుతున్నారు, రష్యా, చైనా హమాస్ నాయకులతో సమావేశమయ్యాయి. అమెరికా వ్యతిరేకులు అంతా కలిసి యుద్ధంలో పాల్గొనే రోజు రావచ్చని అన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?