US: భారతీయ స్కాలర్ బాదర్ ఖాన్‌కు ఊరట.. బహిష్కరణను అడ్డుకున్న కోర్టు
- భారతీయ స్కాలర్ బాదర్ ఖాన్‌కు ఊరట
- బహిష్కరణను అడ్డుకున్న వర్జీనియా కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్‌తో సంబంధాలు ఉన్నాయంటూ భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిని అరెస్ట్ చేసి అమెరికా బహిష్కరించింది. అయితే ఈ బహిష్కరణను వర్జీనియా కోర్టు అడ్డుకుంది. తదుపరి ఉత్వర్వులు ఇచ్చేంత వరక బహిష్కరణపై నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Mahesh Babu: అందరికీ ఏజ్ పెరుగుతుంటే నీకు తగ్గుతుందేంటయ్యా
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
బాదర్ ఖాన్ సూరి.. భారతీయ పౌరుడు. ఇరాక్-ఆప్ఘనిస్థాన్‌లో శాంతి నిర్మాణంపై డాక్టరల్ పరిశోధన కోసం అమెరికాలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ చేసేందుకు వీసా లభించింది. ప్రస్తుతం యూనివర్సిటీలో ఉంటూ స్కాలర్‌గా కొనసాగుతున్నాడు.
అయితే సోమవారం వర్జీనియాలోని తన ఇంటి వెలుపల ఉండగా బాదర్ ఖాన్ సూరిని హోంల్యాండ్ సెక్యూరిటీ బృందం అరెస్ట్ చేసింది. బాదర్ ఖాన్ సూరి హమాస్ మద్దతుగా.. యూదు దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. అంతేకాకుండా హమాస్ ఉగ్రవాదితో కూడా సంబంధాలు ఉన్నాయంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు.. బహిష్కరణ వేటు వేశారు.
ఇది కూడా చదవండి: Watermelon:కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఇన్ని రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు!
అయితే బహిష్కరణ వేటును బాదర్ ఖాన్ సూరి లాయర్.. వర్జీనియాలో కోర్టులో సవాల్ చేశారు. బాదర్ ఖాన్ భార్య.. పాలస్తీనాకు చెందిన అమెరికా పౌరురాలు కాబట్టే.. సూరిపై హమాస్ ముద్ర వేస్తు్న్నారని.. ఉగ్రవాదులతో అతనికి ఎలాంటి సంబంధంలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న వర్జీనియా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్యాట్రిసియా టోలివర్ గైల్స్ కీలక తీర్పు వెలువరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సూరిని అమెరికా నుంచి బహిష్కరించకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే హమాస్‌తో సంబంధాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను జార్జ్‌టౌన్ యూనివర్సిటీ కూడా ఖండించింది. ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమకు తెలియదని.. నిర్బంధానికి సంబంధించిన సమాచారం కూడా తమకు తెలియజేయలేదని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బాదర్ ఖాన్ సూరి లూసియానాలోని ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
బ్యాగ్రౌండ్ ఇదే..
బాదర్ ఖాన్ సూరి.. 2020లో న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. మరొక పరిశోధన కోసం అమెరికాలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హమాస్‌కు అనుకూలంగా.. యూదు మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!