Iran-Israel War: రంగంలోకి అమెరికా.. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ప్రణాళిక!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా
- ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ప్రణాళిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఇరు పక్షాలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరుగుతోంది. అణు ఉత్పత్తిని నిలిపివేసేంత వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. మరోవైపు తమతోనే అణు ఒప్పందం చేసుకోవాలంటూ అమెరికా అవకాశాలు ఇస్తోంది. కానీ అందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఎవరితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోమంటూ తేల్చి చెబుతోంది. దీంతో పరిణామాలు తీవ్ర ఉధృతం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Exclusive : వాయిదా పడుతున్న స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్.. కారణాలు ఏంటి.?
Also Read
- India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
- Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
తాజాగా ఈ యుద్ధంలోకి అగ్ర రాజ్యం అమెరికా కూడా దిగేందుకు సిద్ధపడుతోంది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేసేందుకు వైట్‌హౌస్ ప్రణాళికలు రచిస్తోంది. కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా ట్రంప్ వెళ్లిపోయారు. అనంతరం వైట్‌హౌస్‌లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిట్యుయేషన్ రూమ్‌లో ఉన్నత స్థాయి జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్‌తో యుద్ధానికి దిగితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయని ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చించినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. భవిష్యత్ వ్యూహాలపై ముఖ్య నేతలంతా మేథోమథనం చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: YS Jagan: నేడు రెంటపాళ్లకి వైఎస్ జగన్.. పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ!
అయితే ఈ సమావేశంలో ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయాలని అమెరికా నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను దెబ్బకొట్టాలని అమెరికా భావిస్తోంది. పర్వతం లోపల లోతుగా దాచబడిన ఫోర్డో ప్లాంట్‌ను ధ్వంసం చేసేందుకు వైట్‌హౌస్ కసరత్తు చేస్తోంది.
ఇందుకోసం GBU-57 బంకర్ బస్టర్ బాంబును ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆక్సియోస్ నివేదించింది. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు ప్రత్యేకంగా పని చేయగలవని యూఎస్ సైన్యం భావిస్తోంది. GBU-57 బంకర్ బస్టర్.. లోతుగా పాతిపెట్టబడిన లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం ఉంటుంది. 61 మీటర్ల వరకు భూగర్భంలోకి చొచ్చుకుపోగలదు. అనుకున్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. ఇరాన్ అణు స్థావరాలు నాశనం చేయడం అమెరికా ఆయుధ సామగ్రికే సాధ్యమని ఇజ్రాయెల్ కూడా భావిస్తోంది. ప్రస్తుతం ఆ సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదు.
ప్రస్తుతం అమెరికాకు చెందిన అత్యాధునిక బాంబర్లు హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాలోని అమెరికా-బ్రిటిష్ సైనిక స్థావరంలో మోహరించి ఉన్నాయి. ఇరాన్ నుంచి దాదాపు 2,358 మైళ్ళు (3,796 కి.మీ) దూరంలో ఉన్నాయి. కార్యకలాపాలు నిర్వహించే పరిధిలోనే ఈ బాంబర్లు ఉన్నట్లుగా బీబీసీ తన నివేదికలో పేర్కొంది.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!