Zelenskyy: వైట్ హౌజ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు బిగ్గరగా మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిణామాలతో సమావేశంలో పాల్గొన్న దౌత్యవేత్తలతో సహా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు. జెలెన్స్కీ అమెరికాని అగౌరపరిచారంటూ, యుద్ధం ఆగడం అతడికి ఇష్టం లేదని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, అమెరికా ఒక హంతకుడు(పుతిన్)కి మద్దతుగా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం సరైంది కాదు అని పేర్కొన్నారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు.
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా పేరున్న అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారతదేశాన్ని అస్థిరపరిచేసందుకు సోరోస్ కుట్ర పన్నినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల చేసిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
Donald Trump: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో త్వరలో సమావేశం అవుతానని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తప్పకుండా.. అతడికి నేనంటే ఇష్టం.. కిమ్ చాలా స్మార్ట్ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Trump Tower: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. తన తొలిరోజు రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో అమెరికా-ఇండియాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ భారత్‌కి సన్నిహితుడనే పేరుంది. మోడీ-ట్రంప్ మధ్య ఉన్న స్నేహం ఇరు దేశాల కీలక ఒప్పందాలకు కారణమవుతుందని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు భావిస్తున్నారు.
America: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Trump Diet Coke Button: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓవల్ ఆఫీసులోని ఆయన టేబుల్ పై స్పెషల్ బటన్ ను సిబ్బంది ఏర్పాటు చేశారు. ట్రంప్ ఈ బటన్ నొక్కగానే డైట్ కోక్ ను సిబ్బంది తీసుకొచ్చి ఇవ్వనున్నారు.