Joe Biden: అమెరికా అధ్యక్షుడి పదవీ బాధ్యతల నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వీడింది కేవలం కార్యాలయాన్నే, పోరాటాన్ని కాదు అన్నారు.
Vivek Ramaswamy: అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక పరిణామం జరిగింది. భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.
PM Modi: వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రోటుండాలో జరిగిన కార్యక్రమంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందుగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. జేడీ వాన్స్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అగ్ర రాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం నాడు జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడు.. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై అతడు దూకుడుగా ఉన్నట్లు తెలిపాడు.
Trump On TikTok: టిక్‌టాక్ సేవలకు సంబంధించి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్ కంపెనీలో సుమారు 50 శాతం వాటా యూఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్ తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు.
Antony Blinken: గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటానన్న డొనాల్డ్ ట్రంప్ మాటలను పట్టించుకొని టైమ్ వేస్టు చేసుకోవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. అసలు అది జరిగే పని కాదన్నారు.
ట్రూడో తాజాగా స్పందించారు. కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రెండు దేశాలలోని కార్మికులు, వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా ప్రజలు లాభపడుతున్నారని అతడు తెలిపాడు.
డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు.